Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా. కందేపి రాణి ప్రసాద్
98661 60378
డాక్టర్! డాక్టర్ అని అరుచుకుంటూ ఐదారుగురు వ్యక్తులు కంగారుగా సృజన్ ఆసుపత్రి లోపలికి వస్తున్నారు. ఒక మూడు నెలల పాపను చేతుల్లో వేసుకొని తెస్తున్నారు. వాళ్ల ముఖాల్లో ఆదుర్దా చూసి కాంపౌండర్ లకు అర్థమైంది వెంటనే ఇంటర్ కమ్ లో డాక్టరుకు విషయం వివరించారు. అలవాటు ప్రకారం వారిని ఎమర్జెన్సీ రూములోకి తీసుకెళ్లారు. అప్పటికే డాక్టరు పైనుంచి లిఫ్టులో రూమ్ లోకి వచ్చి ఉన్నారు.
పాపను టేబుల్ మీద పడుకోబెట్టారు పాప మూతికి పాల మరక అంటుకొని ఉంది స్టెత్ తో పాపను పరీక్షిస్తూ ఏమైందమ్మా అడిగాడు డాక్టరు పాపకు ఇప్పుడే పాలు పట్టి పడుకోబెట్టాను ఒక ఒక అరగంట వంటింట్లో పని చేసుకుని మళ్ళీ వచ్చి చూసేసరికి పాప ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది సారూ! వెంటనే ఇక్కడికి తీసుకొని వచ్చాము సారూ! అంటూ ఏడుపు మొదలెట్టింది. జాగ్రత్తగా చూసి మందులియ్యండి సారూ! మాకు పెండ్లి అయినా ఐదేళ్లకు పుట్టింది సారూ ఏడుపు గొంతుకతో చేతులు జోడించి అన్నడోకతను బహుశ అతను పాప తండ్రి కావచ్చు.
వాళ్ల అ మాటలు వింటూ పాపను అన్ని రకాలుగా పరీక్షలు చేస్తూ 'పాపకు పాలు ఇవ్వాల్సిన టైంకే ఇచ్చావా అమ్మా' అడిగాడు డాక్టరు. 'లేదు సారూ నేను పనిమీద ఉండేసరికి అరగంట లేటయ్యింది ఆకలేసిందేమో సారూ విపరీతంగా ఏడ్చింది ఇల్లేగిరిపోయెలా ఏడ్చింది పరుగు నా వచ్చి పాలు తాగించాను సార్' అన్నది పాప తల్లి కళ్ళు తుడుచుకుంటూనే
డాక్టరుకు విషయం అర్థమైంది పాప కళ్ళు పరీక్షించారు. గుండెలపై చేతులు వేసి గట్టిగా నొక్కుతున్నారు. డాక్టరు పాప బంధువులకు ఏదో అనుమానం పొడసూపి పాపా అంటూ ఏడవడం మొదలుపెట్టారు. ఎంతసేపు కార్డియాక్ మసాజ్ చేసిన పాపలు చలనం లేదు అసలు పాప చనిపోయి అరగంట దాటింది పోయింది తల్లి పిల్లకు పాలిచ్చినప్పుడే పాప చనిపోయింది పాప ఆకలికి గట్టిగా ఏడ్చింది అందువల్ల బాగా నోరెండి పోయింది. తల్లి ఆలస్యంగా వచ్చి గబగబా పాలు పట్టింది ఎండిపోయినా నోట్లోకి హఠాత్తుగా పాలు పడేసరికి అవి నోట్లోకి కాకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్లాయి. పాలు ఊపిరితిత్తుల్లోకి పోతే వెంటనే మరణం సంభవిస్తుంది. పాలు అడ్డంగా ఉండటం వల్ల గాలి లోపలికి వెళ్లలేదు అందుకే క్షణాల్లో ప్రాణం పోయింది కానీ వాళ్లకు అర్థం కాక పాప పడుకుంది అనుకున్నారు డాక్టరు మనసులో పాప మరణించడానికి గల కారణాన్ని అర్థం చేసుకున్నాడు చాలా మంది తల్లులు చేసే పొరపాటు ఇదే ఏడుస్తున్నాడని గబగబా పాలు పట్టాల అనుకుంటారు లేదా నిద్రపోయే పిల్లవాడికి ఆకలేస్తుందేమొననే అతి ప్రేమతో పాలు పట్టాటమో లేదంటే తల కింద అ ఏమి ఎత్తు పెట్టకుండా పాలు తాగించడమో చేస్తారు. దీనివల్ల పాలు గొంతులోనికి జారకుండా ముక్కులోని కి తద్వారా ఊపిరితిత్తుల్లో కి వెళ్లి మరణం సంభవిస్తుంది.
డాక్టర్ స్టెత్ తీసేసి ఏమి ఉపిరి లేదమ్మా అని భారంగా చెప్పాడు. పాప తల్లిదండ్రుల రోదనలతో ఆసుపత్రి దద్దరిల్లిపోయింది ఏదో మందు లేని జబ్బు వచ్చి చనిపోతే బాధ ఉండదు కానీ చేజేతులా చిన్న నిర్లక్ష్యం వల్ల అజాగ్రత్త వల్ల అవగాహన లేక పోవడం వల్ల బిడ్డల మరణం సంభవిస్తే బాధ కలుగుతుంది మరి ఈ ఇప్పుడంతా న్యూ క్లియార్ ఫ్యామిలీలో కదా! కొత్తగా తల్లి అయినా నా ఆడపిల్లకు సాలహాలిచ్చెందుకు అత్తగారు ఇంట్లో ఉండదు కదా!