Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గద్దె.అనంతలక్ష్మి, ప్రధానోపాధ్యాయని
నరసరావుపేట,గుంటూరు
8500988499
వర్తమానము ఆశలు రేకెత్తించే కరోనా అదృశ్యానికై..
వెలుగు నింపే రైతన్నల పల్లెలు సిరిధామంగా...
మంచు ముత్యపు పైరు పంటల జల్లులు కురియగా..
వెన్నెల జలతారు ధరణి మాతపై..
మేలిముసుగులా హిమ తివాచీ పరచగా...
భానుడు కరిమబ్బు నీడలను చీల్చుకొని
మకరరాశియందు విచ్చేయగా..
మగువలు రంగవల్లుల సొగస్సులద్దగా...
గొబ్బియల్లో గొబ్బియల్లోయని ఆటలాడగా..
డూడూ బసవన్నల కేరింతలులో..
హరిదాసు సంకీర్తన ఆలపించగా...
మిన్నంటే పతాకాల మేళవింపుగా
పౌరుషాన్ని జురిపించే కోడిపందెములు..
ఆటవిడుపుకై పందెపెద్దుల బండలాగుళ్లు..
పాపక్రియలు భోగి మంటలందు ఆహుతి జేయగా
భోగభాగ్యముల సిరి ఇంటియందు పొంగిపొర్లగా
పశుసంపద నెలవుగా కనువిందుల కనుమగా
ఇంటింటా కొత్త కోడళ్ల,అల్లుళ్ల సరదాల సందళ్లుగా
ఘుమ,ఘుమలాడే పిండివంటలతో నోరూరగా
ముక్కనుమ ముక్కలతో విందారిగించమని
నిండు మనసుతో ఆహ్వానిoచ విచ్చేసే
కమనీయ కడు సొగసైన సంక్రాంతి లక్ష్మి...
అందరి ఆనందాల మేళవింపుగా...