Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్ఫరాజ్ అన్వర్
9440981198
అన్నదాత ఆరుగాలం మడికట్లల్లో
లయబద్దంగా శ్రమగీతమాలపిస్తే
జలసిరి సాయంతో ప్రకృతి పురుడోసుకుని
పచ్చని చేలని ప్రసవించింది..
పచ్చని పంటల్ని కోస్తే ఇంటికి
కమ్మని ధాన్యసిరి తరలివచ్చి
ఆ శ్రమనిలయం మురిసిపోయి
సంతోషతాండవమాడింది
పొద్దుపొద్దున్నే గిలిగింతలు పెడుతున్న
చలిని చక్కిలిగింతలు పెట్టించడానికి
భోగి మంటలేసి కాపుకుంటే
చల్లని చలిలో ఆ సెగ తనువును
స్పృశించి వెచ్చటి అనుభూతినిచ్చింది
భోగి మంటల భోగభాగ్యాలతో
ముద్దుగొలిపే అంగరంగవైభవ
రంగురంగుల రంగవల్లుల అల్లికలతో,
ప్రతి వాకిలి సాంప్రదాయలోగిలియై
సగర్వంగా తొణికిసలాడితే..
కరోనా మహమ్మారితో చిగురుటాకులా
వణికిపోయిన ప్రతి ఇంట ఆ రోగం
కడుపుమంట చల్లారి ఆ తంటా నుండి శాశ్విత విముక్తి కలగాలని ఆశిస్తూ..