Authorization
Sun March 02, 2025 07:54:36 am
- కాలై కవితసుభాష్
కామారెడ్డి జిల్లా కౌలాస్ గ్రామం
6281950150
మూడు దినాల పండుగ
ధన ధాన్యమే నిండుగ
పుష్యమాసపు సమయం
సూర్యుడు మకర రాశిలో పయనం
భోగభాగ్యాల భోగి
చలి మంటలతో వెలిగి
మకర సంక్రాంతితో ముంగిలి
రంగుల హరివిల్లుతో లోగిలి
గాలి పటాలే గగనాన
రంగుల సింగిడి విరిసే నా
గొబ్బెమ్మలు రంగవళ్ళుల మధ్యన
గంగిరెద్దులాటతో హరిదాసు కీర్తన
కనుమ రోజున కోడిపందాల కొట్లాట
పిల్లల తలపై రేగు పండ్లు పోయుట
కొత్త ధాన్యంతో పిండివంటలు
కొత్త అల్లుళ్ల తో ఇల్లంతా సందళ్ళు
నువ్వులు,కూష్మాండ దానం
అది మన ఆచారం, సాంప్రదాయం
ముత్యాల ముగ్గులతో ముంగిలి మెరిసే
పంటరాసులతో లోగిలిలో వెన్నెల విరిసే