Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్రాంతి బ్రాంతులు తెచ్చి
కాంతులు మాయం చేసే
సన్నవడ్లు అమ్మపోతే ధరలేదు ..
కొనుగోలు కేంద్రాలు మూత పాయే
రైతు చేతిలో పంట గిట్టుబాటు లేక గిర్రున దిమ్మతిరిగే...అమ్మకం దారుని స్థితిమంతం
కొనుగోలుదారుని పరిస్థితి ఆగమ్యం
రైతు చట్టాలు ఆధాని అంబానిలకు రెడ్ కార్పెట్
చాలిలో ఎముకలు కోరుకవట్టే
సుప్రీం తీర్పుతోనైన మారండి
రైతుల వద్ద మీరు కొనండి
స్వేచ్ఛ వ్యాపారం అంటే కార్పొరేట్ శక్తుల ఒత్తిళ్ళల్లో
బలిపీఠం పై రైతులు
ఇదేనా అంబేద్కర్ రాసిన
అదేశక సూత్రాలు..రాజ్యాంగం లో పొందికైన సామ్యవాద నియమాలు
ప్రవేటికరణ శక్తుల్లో భారతీయ రైతుకు ఉందా ధీమా
70 ఏళ్ల స్వసంత్రం లో రైతు ఏడ్వాని రోజు తప్పా
నవ్విన రోజు ఉందా
మీరు భరోసా కల్పించండి
సాయం తప్ప ఎంత వ్యయం అయిన అన్నం పెడుతున్న రైతుకు లాభాలు ఇవ్వకున్న సున్నం అయితే పెట్టకండి
ఎద్దు ఎడిసిన వ్యవసం
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపాడదు
నా రైతు సోదరులు గజ గజ వణికె చలిలో ఉంటే
సంక్రాంతి నాకు బ్రాంతి కాక కాంతి ఎలావుతుంది మోడీ
జర సొంచో కె.సీ ఆర్ జెర సొంచో జగన్ జర ఆలోచించండి
నిజంగా రైతుల పాట్ల ప్రేమ చూపండి..జై కిసాన్ నినాదం మాటకు మాత్రమే పరిమితం చేయకండి
రైతుల దీక్షకు మద్దతుగా
- ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్