Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మకరం లోకి ప్రవేశము
హేమంత రాగాలు కిలకిలా పుణ్యతీతుల ఆగమనం..ఉత్తరాయణం
సిరులు కురిసే వేళా..రైతులు ఉప్పొంగే వేళా ప్రకృతితో మమైకం
సకల జీవుల మనుగడలో సూర్యశక్తి ఆవశ్యం
హరికథకుల..గంగిరెద్దుల
విన్యాసపు వినోదాలు..జీవిత తరంగాలను సంస్కృతి తో
తన్మయత్వం
రంగవల్లులు.. రంగురంగుల గాలి పటాలు
సూక్ష్మ ములో మోక్షం ఇచ్చే బోగిమంటలు
అడపిల్లల్ని గౌరవించే కనుమ
ఊరంతా కోళ్ళపంధాలు
జల్లికట్టు విన్యాసాలు
చక్కర కలిపిన నువ్వులు
జీవితం లో చేదు తీపులు
అని చెప్పే సత్యం
మనిషి పుట్టుక నుండి మరణం వరకు ప్రకృతి
మనిషి కి బొదిస్తూనే ఉంది
సంక్రమణం ..ఓ సంక్రాంతి
అందుకే ప్రకృతి పండుగ సంక్రాంతి
- ఉమశేషారావు వైద్య
9440408080