Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిత్రమా ఏంటి..?
మన పరిస్తితి...
ఎవరికి అర్థం కానిస్థితి..
ఏ స్థితి నుంచి ఏ స్థితి లోఉన్నాం!!..
ఏంటి ఈ పరిస్థితి..
ఎందుకు ఈ దుస్థితి..
బాల్యం దాటిపోయే..
యవ్వనం ఎగిరిపోయే..
వృద్ధాప్యం ఉండిపోయే
అంతలోనే ఇంతమార్పు..
బరువెక్కిన బతుకులాయే!!..
ఎవరు మార్చేసిరి..
ఎవరు కాగేసిరి
శరీరం మీద ముడతలువచ్చే...
లొలొపల వణుకుబుట్టె..
గుండెలో దడ పుట్టే...
మనసులో తోణుకులు మొదలాయే..
మన అన్నిశక్తులు
హరించుకు పోయినవి!!..
వంగిన శరీరం..
కుంగిన మనసు..
నడవలేనిస్థితి..
ఏపని చేయలేని పరిస్థితి..
చేయూతనివ్వని అవయవాలు
సహకరించని శరీర తత్వం
చూపులకందని ప్రపంచం!!..
చివరికి ఇంతపెద్ద శిక్ష విధిస్తాడు!!..
కక్ష సాధింపు అంటే ఇదేనేమో...
ఎవరికి ఎవరు కాని స్థితి..
అందరూ అసహ్యించుకొనే దీనస్థితి..
ఎప్పుడు ఏదో ఓ రోగం వస్తోంది!!..
జీవఛ్చవములా బతికే పరిస్థితి!!..
అశక్తత నిస్సత్తువ తోడై...
నిత్యం వేధిస్తూ వాదిస్తుంటాయి!!..
జీవితానికి ఇదో శాపం!!..
అన్నీ కోల్పోయిన తాపం!!..
ఆవహించిన సమస్త బాధలు!!..
కదిలేకాలంలో..
కాళ్లకు పడిన బంధాలు!!.
ఉషోదయం పోయింది..
నిశిరాత్రి మిగిలింది...
ఎప్పుడో ఏదో చేసిన...
తప్పుల ప్రతిఫలమా..
ఈ వృద్ధాప్యం అనే...
చెరసాలలో చిక్కి ఉన్నాం!!..
చిత్రహింసలకు గురవుచున్నాం...
ఎన్ని జన్మలెత్తినా...
తప్పని ఈ వృద్ధాప్యం...
మరుగున పడ్డ జ్ఞాపకాలు!!
వెలుగును కోల్పోయిన
అనుభూతులు!!..
యవ్వనపు ఊపిరికి దూరమై..
తియ్యటి తీపిగుర్తుల ...
ఆనవాలు జారిపోయినవి...
ఏకాంతపు సంధ్యాసమయంలో
నడి సంద్రపు నావలా ...
కొట్టుమిట్టాడుతోంది ఈజీవితం!!..
కొంటే వచ్చే యవ్వనమైతే...
ఎందరో కోట్లుపెట్టి కొనేసేవారు
ఇంకా కుళ్లు పెరిగిపోయేది!!..
మోసం స్వార్థం ఆకాశ మంటేది..
అందుకే ఎవరికీ అందకుండా
రూపాంతరాలతో రూపుమాపేది!!..
అంబటి నారాయణ
నిర్మల్
9849326801