Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాస్పిటల్ అవరణంతా పిల్లల ఎడుపులతో గందరగోళంగా ఉంది ఒపి హాల్లో వరసగా ఉన్న కుర్చీల లో పేషంట్లు కూర్చున్నారు. పిల్లల నెత్తు కున్న తల్లులు పిల్లలను ఊరడిస్తూ కూర్చున్నారు. అక్కడున్న కంపౌడరు ఒక్కొక్క పేషంటును లోపలికి పంపిస్తున్నాడు. కాసేపు కూర్చున్న పేషంట్లు రిసెప్సనిష్టు దగ్గరకు వెళ్లి మా నెంబరు ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. మూసిన కన్ను తెరవకుండా ఒళ్ళు మాడిపోయే జ్వరంతో కొందరు నేను లోపలికి రానంటూ గేట్ దగ్గరే ఆగి మారం చేసే వాళ్లు కొందరు. జ్వరం యొక్క అసహనంతో తాము ఏడుస్తూ అమ్మలను విసిగిస్తూ కొందరు. వాంతులు విరోచనాలతో బాత్రూమ్ ల దగ్గరే నిలబడ్డ కొందరు. ఇలా రకరకాల వ్యక్తులతో కలగాపుల గంగా ఉన్నది
డాక్టరు దగ్గర చూపించుకుని బయటకు వచ్చిన వాళ్ళు మెడికల్ షాపులో మందులు తీసుకుంటున్నారు. కొంతమంది ఇంజక్షన్లు చేయించుకొని పిల్లల ఏడుపులతో బయటకు వస్తున్నారు. పల్లెల నుంచి ప్రొద్దున్నే వస్తారు దాదాపు సాయంత్రం అవుతుంది వాళ్ళు వెళ్లేసరికి. అందుకే వాళ్ళు తినడానికి తిండి పదార్థాలు తెచ్చుకుంటారు. ఒకవేళ తెచ్చుకోకున్న పక్కనే ఉన్న దుకాణాల్లో పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు కొబ్బరి బొండాలు మొక్క జొన్న కంకులు రేగుపళ్ళు ద్రాక్ష అరటిపండ్లు వంటి చిరు తిండ్లు కొని పెడుతూ ఉంటారు.
అకస్మాత్తుగా అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకామె తన పిల్లవాడు పలకడం లేదంటూ లేచింది. వెంటనే ఆమెను డాక్టరు రూమ్ లోనికి తీసుకెళ్లారు. చేస్తున్న పని ఆపి ముందుగా టేబుల్ పై పాడుకోబెట్టమన్నడు డాక్టరు. ఏమైందమ్మ సీరియస్ గా ఉంటే ఇందాకే లోపలికి రావచ్చు కదా కొద్దిగా జలుబుతో ముక్కులు మూసుకుపోయాయి అంతే ఇప్పుడే ఇలా పలకడం లేదు ఇప్పటి దాకా బాగానే ఉన్నాడు అన్నది బాబు తల్లి. డాక్టరు నాడి పరీక్షిస్తూ ఉన్నాడు నాడి అందలేదు. స్టేటస్ స్కోప్ పిల్లవాడి గుండెల మీద పేట్టి చూస్తే ఏమి వినిపించడం లేదు. కళ్ళు మూసుకుపోయాయి ఉన్నాయి కళ్ళు విప్పి పరీక్షించాడు డాక్టరు ప్రాణం పోయింది ఏమి లేదు ఏమైందబ్బా! ఎందుకు ప్రాణం పోయింది అర్థం కాలేదు డాక్టరుకు మిగతా టెస్టులు చేస్తూనే తల్లిని ప్రశ్నించసాగాడు డాక్టరు. మీరు వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు బాబు గుండె జబ్బులాంటివి ఏమైనా ఉన్నాయా ఇంతకు ముందు ఎప్పుడైనా ఏదైనా ప్రమాదాలు జరిగాయా అడుగుతున్నాడు డాక్టరు. తల్లి కీడు ఏదో శంకీస్తున్నది డాక్టరు ప్రశ్నలకు ఆదుర్దాగా అయినా సమాధానాలు చెప్తున్నది. ఇప్పటివరకు ఏ సమస్యలు లేవు ఎప్పుడూ జ్వరం కూడా రాదు డాక్టరు ఇప్పుడే జలుబుతో అవస్థ పడుతున్నాడని ఆసుపత్రికి తెచ్చాను సార్ అన్నది ఆమె. ఉదయం నుంచి ఏమేమి తినిపించావు అడిగాడు డాక్టరు. ప్రొద్దున పాలు తాపించి తెచ్చాను డాక్టర్ ఇప్పుడే ఏడుస్తున్నడని మక్క కంకి కొనిచ్చా అన్నది ఆమె డాక్టరుకు ఏదో అర్థమైంది మక్క కంకి నువ్వే తినిపించవా తినమని వాడికే ఇచ్చావా అన్నాడు. వాడే తింటాడు ఎప్పుడైనా కంకి చేతికిచ్చి నేను బాత్రూమ్ కి వెల్లోచ్చేసరికి ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నాడు. ఎంత పిలిచినా పలకలేదు అప్పటిదాకా అది కావాలి ఇది కావాలి అని సతాయించినొడు పలక్క పోయే సరికి బయమైంది సారూ అని భయభయంగా చెప్పింది. మొత్తం అర్థమైంది డాక్టరుకు అప్పుడు పిల్లవాడి నోరు తెరిచి చూశాడు గొంతులో మక్క విత్తు ఇరుక్కుని కనిపిస్తున్నది. మక్క విత్తు గొంతుకు అడ్డం పడడం వలననే పిల్లవాడి ప్రాణం పోయింది. పిల్లవాడి తల్లిని వాళ్ల అత్తను పిలిచి డాక్టరు ఇలా చెప్పసాగాడు పిల్లవాడి ప్రాణం ఏ అనారోగ్య సమస్యతోనూ పోలేదు కేవలం మీరు కొనిచ్చిన మక్క కంకితోనే ప్రాణం పోయింది. మీరు కంకి పిల్లవాడి చేతికిచ్చి మీ పని మీరు చేసుకుంటున్నారు. విత్తులు కొరికి నమలకుండనే మింగేశాడు అది లోపలికి పొక గొంతులో అడ్డం పడింది. అంతే గాలి ఆడక ప్రాణం పోయింది పైగా జలుబుతో ముక్కులు మూసుకుపోయి ఉండటం వల్ల గొంతుకు అడ్డం పడగానే ప్రాణం పోయింది. పసిపిల్లల ఆట పాట లే కాదు తిండి వగైరాలు కూడా పెద్దవాళ్ళ పర్యవేక్షణలోనే జరగాలి లేకపోతే ఇలా అనవసరంగా ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. ప్రాణం పోయింది అన్న మాట ఒక్కటే అర్థమైంది వాళ్లకు ఏడుపులు మిన్నంటాయి ఇంట్లో పిల్లల్ని పెంచే వాళ్ళు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి.
డా. కందేపి రాణి ప్రసాద్