Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరువది ఒక్క ఏండ్ల
వయస్కులైన ప్రతి ఒక్కరి
ప్రాధమిక హక్కు
ఓటు హక్కును పొందడం
పొందిన హక్కును వినియోగించుకోవడం
మరి ముఖ్యంగా సద్వినియోగ
పరచుకోవడం!
,నేను ఒక్కడినే వేయకుంటే
ఏమోతుందిలే అనే నిర్లక్ష్యధోరణిని వీడి
నీ ఓటనే వజ్రాయుధాన్ని సంధించి
స్వచ్ఛపాలకులను ఎన్నుకోవాలి
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి!
వాగ్దానాల వరదకి ఎదురీదాలి
వాస్తవాలను గ్రహించి ఓటేయాలి
ప్రలోభాలను ప్రక్కకునెట్టి
ప్రగతిశీల నాయకులకు ఓటేయాలి
మద్యం మహమ్మారి తిలోదకలిచ్చి
మానవతావాదులకు ఓటేయాలి
తాయిలాలకు తలొగ్గక
తగిన వ్యక్తులనే అందలమెక్కించాలి!
విలువైనది నీ ఓటు
విలువలున్న వ్యక్తికే ఓటివ్వు
ఓటేయడం నీ ప్రధమ కర్తవ్యం
విస్మరిస్తే చెల్లించాల్సి వస్తుంది తగిన మూల్యం!
రాబోయే కాలంలో
కాబోయే నవయు వ ఓటరులూ
మిరే ప్రజాస్వామ్య సంరక్షణకు
పునాదిరాళ్లు
వినుకోండి నా వేడుకోళ్లు
సక్రమంగా స్పందిస్తే అదే పదివేలు
సర్వజనులకు చేకూరును గట్టి
మేలు!
ఆళ్ల నాగేశ్వరరావు
గుంటూరు
సెల్ నెంబర్ .7416638823