Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి పక్కన ఉంటే
జీవితకాలం బ్రతకొచ్చు!!...
మనసుకు రెక్కలు
మొలిపించుకొని...
ఆకాశం...రంగుల
పూలను...చూస్తూ ఉండొచ్ఛు!!...
కువకువలప్రేమలను
పొందుతూ...
కొమ్మలు రెమ్మలు
లేలేత సూర్యకిరణాల
అభ్యంగన స్నానంతో...
కురులను ఆరబెట్టుకొంటుంటే...
చూడముచ్చటగా ఉంటోంది!!...
మనసులో
ఓ కొత్త సంగీత శబ్దం!!...
చిలకా గోరింకల
ముద్దుముచ్చట్లు
మట్టి పరిమళాన్ని
అస్వాదిస్తుంటే...
జగతిన శాంతి!!...
ప్రకృతికి కాంతి!!....
ప్రతిక్షణం
ప్రాణికోటికి ప్రాణమే!!...
మానవ జీవనానికి ఆకృతి...
ప్రాణ ప్రగతికి కొత్తమార్గం...
జీవనాకృతికి కొత్త భాష్యం...
ఈ నేలమీద ప్రకృతి పులిమిన
ఆకుచ్చని రంగు
ఎప్పటికీ వెలసిపోదు!!...
లోకాన్ని వెలిగించేది ప్రకృతే!!...
ఇదో నిత్య చైతన్య జీవం!!...
నిజానికి ఈ జగతి
కప్పుకున్న మేలిముసుగు!!...
మానవతా విలువలు పెంచి..
సమానత్వపు వెలుగులు పంచి..
అందరిలో ప్రాణమై
నిలుచున్న దివ్యకాంతి!!...
మనుషులకు కావలసింది
ఆస్తులు బంగ్లాలు కాదు!!...
పచ్చని ప్రకృతి పాదులు!!...
ఈ దారులన్నీ
ప్రాణం పోసే వీధులు...
అప్పుడే ప్రతి ఇల్లు
ఓ పసందైన పచ్చని ప్రదేశం...
ప్రకృతి గొప్ప నిర్మాణ ధాతువు.
మనిషి తృణీకరిస్తే..
అంతా నిర్మానుష్య శూన్యాలే!!...
ఇప్పుడు సమస్త
ప్రకృతిని కోల్పోతున్నాం!!...
మన ఆరోగ్యం
చేతుల్లోనుంచే జారిపోతుంది!!...
ఒకరికి ఇష్టమైతే..
మరొకరికి కష్టమవుతోంది!!...
స్వార్థముతో ప్రకృతిని
మనమే తగులపెట్టుచున్నాం!!...
అనారోగ్యం పెరుగుతోంది!!...
బతుకు ఓ జీవచ్ఛవమై నిలుస్తోంది!!...
నిత్యం ఏదో ఓ రోగం...
వెంటాడుతునే ఉంటుంది....
తెలియని కలతలు ఆవహిస్తుంటాయి....
ఆన్నిటికీ ఆధారభూతం...
భగవత్ప్రసాదితమైన
ఈ "ప్రకృతే"!!....
అంబటి నారాయణ
నిర్మల్
9849326801