Authorization
Sun March 02, 2025 07:52:23 am
వస్తున్నాయ్
పోతున్నాయ్
గణతంత్ర దినాలు
అయినా మారకున్నాయ్
నిరుపేదల బ్రతుకులు!
జెండా వందనం
స్వీట్ల పంపకమే స్వీట్ల పంపకమే
కాకూడదు రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు
పబ్లిక్ కోసం కొంతైనా
సేవచేస్తే అదే పదివేలు!
బడుగు జీవుల ఉన్నతికి
బడికి పోనీ బలకార్మికులకై
ఆకాశంలో సగం ఉన్న నూ
అవకాశాలలో అద: పాతాళంలో
ఉన్న అడపడుచుల కొరకు
నిత్యం నిరుద్యోగం తో
పోరాటామ్ సాగిస్తున్న యువత
కోసం
ప్రయివేటికరణ రక్కసికి బలై
మూతబడిన కర్మాగారాల్లో
పనిచేసే
ఉపాధి కోల్పోయిన కష్టజీవుల
కోసం
రాజ్యాంగ సవరణ గావించయినా
తగిన చర్యలు గైకొనాలి తక్షణం
ప్రజాస్వామ్య పరిరక్షణే కావాలి
పాలకుల ముందస్తు కర్తవ్యాలు!
ఆళ్ల నాగేశ్వరరావు
గుంటూరు
సెల్ నెంబర్.7416638823.