Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమ్మిళిత సంస్కృతి భారతీయత
సమైక్యత సామరస్యత సాధించను
సౌభ్రాతృత్వా న్ని పెంచి పంచను
పౌరహక్కుల సంరక్షణలకు
చరిత్ర నేర్పిన గుణపాఠం
మాతాతీత లౌకికరాజ్య స్థాపన
భారత రాజ్యాంగ లక్ష్యాన్ని నేడు
విస్మరించి పాలకులు... నాయకులు
ప్రజాప్రతినిధులు.... ప్రభుత్వాలు
ఆర్థికమాంద్యం.... అధికధరలు
పేదరికం... దరిద్ర్యం... నిరుద్యోగం
నిర్ములించక నిర్లక్ష్యం వహిస్తూ
శాస్త్రీయ దృక్పధాన్ని పెంచాలనే
ఆదేశికసూత్రాల అపహాస్యం చేస్తూ
వ్యక్తిగత అంధవిశ్వాసాలను
మూఢనమ్మక జాధ్యాలను
రాజ్యానికి ఆపాదిస్తూ
ప్రజావేదికలపై బాహ్యంగా
బాధ్యత మరచి ప్రచారాలు చేస్తూ
మతసామరస్యతను మంటగలిపి
మారణహోమం సృష్టించ బూనడమే
ప్రజాస్వామ్యం పటిష్టతకు
అసమానతల అంతానికి
దారిద్ర్య పేదరిక నిర్మూలనకు
దేశ సంపద అందరికీ అందాలంటే
ఉత్పత్తి సాధనాలు సేవా రంగాలు
ప్రభుత్వ ఆధీనంలో ఉండాలనే
సామ్యవాద సూత్రాన్ని విస్మరించి
ప్రైవేటీకరణతో కార్పొరేటీకరణతో
బడుగు బలహీన వర్గాలకు
సామజికన్యాయ నిరాకరణే
ప్రభుత్వ రంగాన్ని కుదించడం
సంక్షేమరాజ్య భావనను
సంక్షోభ రాజ్యాం గా మార్చడమే
ప్రాధమిక హక్కుల భంగమే
ప్రశ్నించే గొంతుకను నొక్కేయడం
భావప్రకటన స్వేచ్ఛ కు సంకెళ్ళే
ఒకే మతమంటూ.... ఒకే భాషంటూ
నియంతృత్వానికి బాటలు వేస్తూ
బహుళత్వానికి భంగం కలిగించడమే
సమాఖ్య స్ఫూర్తిని సమాధి చేయడమే
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమే
పి. రామనాధం,
భద్రాద్రి కొత్తగూడెం.