Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విరుగుతున్న లాఠీలను లెక్కచేయకుండా
రైతాంగం..
కార్పోరేట్ మాయలో చిక్కుకున్న కీలుబొమ్మ లాంటి ప్రభుత్వానికి
వ్యతిరేకంగా ఒక్కటై ..
అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించాలని కంకణం కట్టుకుని
సత్సంకల్పంతో..కదం తొక్కుతూ ..
దేశరాజధానిలో ప్రభంజనమై కదులుతుంది !
దేశ ఆర్థిక వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుని
ఆడిస్తున్న మేకవన్నె పులులు వల్లిస్తున్న కల్లబొల్లి వాగ్ధానాలని
నమ్మబోమని తెగేసి చెప్పేస్తూ..
సమరశంఖం పూరిస్తూ డిల్లీ పుర వీధులలో ఉద్యమ కెరటమై సాగుతుంది !
ఎదురేలేదనుకుంటూ ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్న పాలకుల కళ్ళుతెరిపించేలా
భారతీయ రైతాంగాం అంతా ఏకతాటిపై చేరుతూ..
తమ హక్కులసాధనకై పోరాటపథాన విప్లవజ్వాలై ఎగసిపడుతూ ..
తమ బ్రతుకులతో ఆటలాడుతున్న ప్రభుత్వాన్ని కూల్చాలనే పట్టుదలతో ముందడుగేస్తుంది !
జి.నాగ మోహన్ కుమార్ శర్మ
హైదరాబాద్
చరవాణి: 9652832290