Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వచ్ఛత నిండిన
మృణ్మయ హృదయుడు..
పల్లె ప్రజల మనసు
మల్లెల కూర్చే రూపకుడు..
సన్నని నడుము
కొప్పున పూవుల సేరు
మెడలో పూసల పేరుతో
మురిపించే ముగ్ధ మనోహరి 'ఎంకి'ని సృష్టించిన
భావుక బ్రహ్మ..
పదాల ఎంపికకు..పొందికకూ
కొత్త అందాలను అలదిన ప్రణయ కవి..
తెలుగు యువత నాలుకలపై
కవిత్వ సొబగులద్ది..
అచ్చ తెనుగు జన పదాలతో
కవితామృతాన్ని జాతికి అందించిన 'భావ' కవి..
'యెంకి వంటి పిల్ల జగాన లేదని..' తన్మయత్వ తేనెని తన కలం దిక్సూచిగా చూపిన దార్శనికుడు..వైతాళికుడు శ్రీ నండూరి సుబ్బారావు..
అచ్చమైన జానపద
ప్రణయ గీతాల ఆవిష్కర్త..!
- సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.