Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక చేత పెన్ను
మరో చేత గన్ను పట్టి
నిజాం వ్యతిరేకతను వ్యక్తం చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు..
తెలుగు, ఉర్ధూల్లో
అనన్య ప్రతిభ..
ఉద్రేకపరచే ఉద్యమ గీతాలు రాయగల సాహితీ దిగ్గజం..
"కదనాన శత్రువుల కుత్తుకల నవలీల..నుత్తరించగ బలోన్మత్తులేనిన భూమి..వీరులకు కాణాచిరా..
తెలంగాణ ధీరులకు మొగసాలరా.." అంటూ
రెండు దశల సాయుధ ఉద్యమ పాటతో ప్రాణం పోసి..
తెలంగాణ ప్రజల్లో పోరు చైతన్య స్ఫూర్తిని రగిలించిన తెలంగాణ ముద్దుబిడ్డ..
నైజాం ప్రజావ్యతిరేక పాలనారీతులను నిస్సంకోచంగా, నిర్భయంగా..
పద్య, వచన, గేయ, కవిత్వంలో వర్ణించి..
తన గళంతో తెలంగాణాన్ని తట్టి లేపిన తొలి గేయ రచయిత..విప్లవకారుడు..
మట్టి మనుషును ఒక్కటి చేసిన..
మట్టిలో పుట్టిన మాణిక్యం..
తెలంగాణ తొలి కవిరాజ పోతన..రావెళ్ళ వెంకట రామారావు..అనుదిన స్మరణీయుడు..!
-సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.