Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీవు ఒంటరివాడివి కాదు!!...
నీ చెంతకు వచ్చింది...
నీకు తోడుగా నడిచింది...
నీ నీడై నిలిచింది!!....
ఎక్కడోపుట్టి..ఎక్కడో పెరిగి
రెండక్షరాలతో
నీతో ముడిపడి...
అందమైన తీరాలను వదలి...
నా అన్నవారిని విడిచి...
నీతో నడిచి వచ్చింది!!....
నీవు ఒంటరి వాడివికాదు!!...
నీ ఊపిరై... నీ ఉద్వేగమై
నీ ఆశలు..ఆశయాల శ్రీకారమై...
నీ జీవిత సాకారమైంది!!...
మమకారంతో...
నీలో సగం భాగమైంది!!...
ఆమె నీ గురించే
ఆలోచిస్తుంది!!...
అన్నిట్లో నీవే అగుపిస్తావు!!...
నీ అందమైన రూపాన్ని
మనసులో నిలుపుకొంది!!...
ఆమె మనసునిండా
నీవే ప్రతిఫలిస్తావు!!...
కళ్ళతో నీ రూపాన్ని
నిత్యం దర్శిస్తోంది!!...
ప్రకృతినిండా
ఎన్ని పూవ్వులున్నా...
నీ అందమైన మోము
వికసిస్తేనే ఆమెకు అనందం!!...
నమ్ముకొని వచ్చింది...
ప్రేమతో నిన్ను కమ్మేసింది...
హృదయాన్ని నైవేద్యంగా అర్పించింది!!..
తన మనసును నీకు.. నివేదించుకొన్నది!!...
అందుకే...ఆమెలో
ఆవేదనను నింపొద్దు!!...
తాళి కట్టిన నీవే...
ఎగతాళి చేస్తే!!...??
ఆగచాట్లు తప్పవు!!...
తొమ్మదినెలలు
మోసి కనిపెంచిన
తల్లిదండ్రులను...
తోడై వచ్చి బతుకును
నడిపించే భార్యను...
ఇద్దరినీ రెండుకళ్లుగా చూసుకోవాలి!!...
అందని ఆనందాలేవో...
వీళ్ళలోచూసుకోవాలి!!...
ఎవరో చెప్పిన మాటలకు..
ప్రేమతో నిండిన
మనసును పారేసుకోకు!!...
ఆర్ద్రతతోనిండిన హృదయాన్ని
ఎక్కడికో విసిరేసుకోకు!!...
కళ్ళుతెరిచి చూసుకో...
నీకై తపించే హృదయాలను!!...
నీలోకం విడిచిరా!!...
ఈలోకంలో
కనిపించేది నీ ప్రతిరూపం!!....
నీతో ఏడడుగులునడిచి వచ్చిన
నీ భార్యరూపం మరిచిపోకు!!...
భార్యను మరిచిపోతే...
బతుకంతా ..బాధలే
బరువెక్కిన బ్రతులే!!..
విజయం లేదు..
అంతా విషాదమే!!.....
అంబటి నారాయణ
నిర్మల్
9849326801