Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకరికొకరువిభేదాలతో
అహంకారం ప్రదర్శించుకోవద్దు!!...
మీ ఇంటికి మీరే కథనాయకులు !!...
సంసారమనే రథానికి
రెండు చక్రాలు భార్యాభర్తలు!!...
ఎన్నాళ్ళైనా..ఎన్నేళ్లయినా
ఎప్పటికీ మార్పు ఉండదు!!...
నిస్తేజం నీరు కార్చినా...
నిర్వీర్యం నిప్పులు చిమ్మినా...
సమస్యల వలయం చుట్టేసినా...
సులువైన మార్గంతో
సంసార రథసారదులై
ముందుకు నడిపించాలి!!....
ఒకరికి ఒకరు తోడు నీడై నిలవాలి..
అన్ని సమస్యలను సామరస్యంగా..
పరిష్కరించుకోవాలి!!..
మంచి అలోచన అనే ఆయుధంతో...
అడుగులు వేస్తూఉండాలి!!...
ప్రశ్నలు మీవే!! జవాబులు మీవే!!...
యుద్ధం మీరే చేయాలి!!...
విజయం మీరేసాధించాలి
మీరే కదా కథకు మూలాధారం..!!
కల్లోలం కలచివేసినా..
విస్ఫోటాలు కమ్ముకువచ్చినా...
భార్య భర్తలు ఒక్కటై భరించాలి!!...
ప్రతినిత్యం మీఇంటికి
మీరే సేవకులు !!...సైనికులు!!...
సుడిగాలులకు ఎదురునిలిచి
సంసారరథాన్ని కాపాడుకోవాలి!!...
భార్యా భర్తలు
స్నేహ దీపాలై వెలగాలి!!...
ఐక్యమత్యంతో అడుగువేయాలి!!...
ద్వేషాలు ఉండొద్దు!!..
దోషాలు నింపొద్దు!!...
వికసించాలి మీలో ప్రేమతత్వం!!...
విరబూయాలి ఆత్మీయనేస్తం!!...
ఒకరికొకరు తోడై ముందుకు సాగాలి!!..
ఎవరు విరక్తి చెందకుండా..
రథచక్రాలకింద నలిగిపోకుండా...
విసిగి వేసారిపోకుండా....
వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా...
అనుక్షణం అంకితభావంతో...
బ్రతుకుమీద ఆశతో...
ఒకరిమీద ఒకరు భరోసాతో...
భాగస్వాములై సాగిపోవాలి!!....
అతివృష్టిని...అనావృష్టిని
ఎదుర్కోవాలి!!....
కష్టనష్టాలను....
సమానంగా పంచుకోవాలి!!...
ఒకరికొకరు ఓదార్పుగా నిలువాలి!!...
ఎన్ని స్పర్థల తుఫానులొచ్చినా...
సామరస్యంగా సర్దుకుపోవాలి!!...
పురుషాంకారం ప్రదర్శించకుండా...
ఉగ్రరూపం దాల్చకుండా...
ఉన్మాదిగా మారకుండా...
మొక్కవోని ధైర్యంతో...
ముందుకు నడవాలి!!....
నిరాశా నిస్పృహలు...
గుండెను తొలిచేసినా...
గుట్టుబయటికి రాకుండా...
చిరునవ్వులతో నిలవాలి!!....
జీవితాన్ని అనుకున్న
గమ్యానికి చేర్చాలి!!....
కుటుంబాన్ని ఉన్నతంగా నిలపాలి!!...
ఇదే భర్తగా విధినిర్వహణలో...
చేయవలసినపని!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801