Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరళ సుందరంగా
వాస్తవికంగా పల్లె పాటలు..
తరతరాల
జాతి జీవన స్రవంతికి దర్పణాలు..
శత వసంత సాహితీ మంజీరాలు..
తెలంగాణ జానపద గేయాలు.!
అచ్చ తెలుగు భాషలో
సంస్కృతీ సంప్రదాయాల ప్రతిబింబాన్ని..
అలతి అలతి పదాలతో
వినసొంపు గేయాలను రచించిన ..
జానపద సాహిత్య కలం!
వినయం, విజ్ఞానం, వినోదాన్ని అందించే..
జనపద భావుకతను
కుప్పలు తెప్పలుగా 'రాశి'పోసిన ప్రాకృత భాషావేత్త!
జనపద పరిశోధక
వాజ్మయ బ్రహ్మ!
'మనిషి బుద్ధిజీవి..
నిరంతర నిత్యాన్వేషి'..అనే సూత్రాన్ని నమ్మిన తెలంగాణా తలమానికం..
జాన పద సాహిత్య సౌధానికి ఆచార్య బిరుదురాజు రామరాజు..
వజ్ర ఖచిత మకుట రారాజు!!
**
---సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.