Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నోతెలిసినోళ్లు...
అన్నీతెలుసని అనుకున్నోళ్లు!!...
అన్నీ తానై ఉనోళ్లు...
అన్నీ అనుభవించినోళ్లు!!...
అనుభవమే...
జీవితమై నడిచినోళ్లు!!....
అనుభూతి అనుభవంగా
వ్యక్తీకరించినోళ్లు!!...
కష్టాన్ని ఇష్టంగా...
మలుచుకున్నోళ్లు!!...
ఎందరివో
జీవితాలు చదివినోళ్లు!!...
లోకమనే పుస్తకాన్ని
తిరిగేసినోళ్లు!!....
వాస్తవమనే
సత్యాన్ని తెలుసుకున్నోళ్లు!!...
శతాబ్దాలచరిత్రను
తిరిగేసినోళ్లు!!...
నిత్యం అన్వేషణలో
అలసిపోయినోళ్లు!!...
గడిచిన గతమెంతో!!...
నడిచే హితమేంటో!!...
రోగాలబాధల్ని...
మానసిక వ్యధల్ని...
సమస్యల వెతల్ని...
అన్నీ భరించినోళ్లు!!....
కలల్ని...కళల్ని...
కవితల్ని... పంచినోళ్లు!!...
వేదన...ఆవేదన ఎరిగినోళ్లు!!...
ప్రపంచమంతా
ఓ చదరంగమని
జనమంతా
పావులని తెలుసుకున్నోళ్లు!!...
వీరిచుట్టూ
అహంకారంలేని సాకారం...
చక్కర్లుకొడుతోంది!!.…
మీ మనోవల్మీకంలో
అనుభూతులను...
అంచనాలకు మించిన
కనబడని వంచనలు ఎన్నో!!...
స్వార్థకురుక్షేత్రంలో...
ఎందరో బలైయ్యారు!!....
ఏది ఎక్కడ మొదలైందో...
ఏది ఎక్కడ అంతమైందో తెలుసు!!...
చిరిగిన గతం...
ఎందుకులే అనుకున్నారు!!??...
మాటలతో ముడివేసేవారున్నారు!!....
మనసుతో తెంపేసేవారున్నారు!!...
మనసుకు...మాటకు
పొంతనలేని వారున్నారు!!...
అన్నీ గ్రహిస్తున్నారు..గమనిస్తున్నారు!!
మతాల మడతలకింద...
ఎంత అగాధముందో!!l??....
కులాల కలతల కింద
ఎన్ని తగాదాలున్నావో!!??...
అన్నీ తెలుసుకున్నోళ్లు
గెలుపుకొరకో..!!??
మీ పరువుకొరకో...!!??
ఇంకాఎన్నాళ్లు???
ఈ దాగుడుమూతలు!!....
ఇంకాఎన్నేళ్ళు??
ఈ ముసుగుపరదాలు!!....
ఎక్కడికి వెళుతోంది ఈసమాజం!!??...
ఏమైపోతుంది...మానవలోకం!!??...
ఆలోచించండి!!...
సగటు మనిషిగా!!...
హృదయంలేని ఉదయం వద్దు!!...
ప్రతి ఉదయం
హృదయంగా మారాలి!!..
అప్పుడే నిండైన నిజాలు... వెలుగుచూస్తాయి!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801