Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అశేష జన వాహినిని
ఆనంద గాన లహరిలో ఓలలాడించి
మైమరపించిన మహోన్నత మధుర గాయకుడు..
మలయమారుత సంగీత పవనం..
సుతారంగా మది మీటి
గగనమంత గంభీర స్వర రాగాలాపన సాగిస్తూ..
గాత్ర మాధుర్య ఝరిలో పరవశింపజేసే కమ్మని గళం గల వాగ్థేవీ వర పుత్రుడు..
అరవయ్యవ దశకంలో ఆబాలగోపాలాన్ని
సంగీత జగతిలో ..
రక్తి, శక్తి, ముక్తి, భక్తి భావాలను
నవరసాలతో పలికించిన సాటిలేని మేటి గాన గంధర్వుడు..
శేషశైలావాస శ్రీవేంకటేశా..
అంటూ ఆ ఏడుకొండల వాడినే లాలించిన వేంకటేశ్వర నామధేయుడు..
సుకుమార కుసుమాల మనో భావ ఃఃపుష్పవిలాపముఁ..
ఏనాటికీ వన్నె తరగని అద్భుత ఖండకావ్యం ఁభగవద్గీతఁను..
తన స్వర మకరందంతో రంగరించి అజరామరం చేశాడు
రాగాలకు నడకలు,
భావాలకు పరిమళాల సొబగులద్దిన సుస్వర మాంత్రికుడు..లలిత గాన గంధర్వుడు..
పాటల ప్రపంచ స్వర స్వర్గ ధాముడు.. అమర గాయకుడు మన ఘంటసాల..
చిరస్మరణీయుడు..
సదా స్మరణీయుడు..!!
-సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.