Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంస్కరణల విప్లవాలకు కారకుడు..
ఖమ్మం జిల్లాలో పుట్టిన తెలంగాణా సాహితీ బిడ్డడు..
చిరుప్రాయంలోనే
జాతీయోద్యమ బాటపట్టిన బాల నాయకుడు
నిజాం నిరంకుశ పాలనను
ఎండగట్టిన సమరయోధుడు..
గ్రంథాలయోధ్యమానికి విశేష గుర్తింపు తెచ్చి
విజ్ఞాన వెలుగులను సర్వత్రా పరచిన తెలుగు భాషాభిమాని..!
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి పర్యాయ పదంగా..
విశేష సేవలందించి
విజ్ఞాన వికాసానికి ఎంతో దోహదం చేసిన శ్రీ ముదిరాజు లక్ష్మీ నరసింహారావు..'ఎమ్మెల్' పేరుతో సుపరిచితులు..ఎందరో మహా నాయకుల జీవిత చరిత్రను
అరుదైన రచనా ప్రక్రియతో
నేటి తరానికి నిధిగా అందించిన దార్శనికుడు.. విద్వత్ భూషణుడు..మాననీయుడు!
-సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.