Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సకలదేవతా స్తోత్రలతో
అన్ని మత ప్రార్ధనా దేవతల కీర్తనలతో
భక్తిరంజని తో ఆరంభమై
ప్రముఖుల సూక్తులను సూక్తిసుధల తో అందిస్తూ
ప్రముఖుల జీవితగాధలను
వెలుగురేఖల ద్వారా వివరిస్తూ
గంట గంటకు వార్తావిశేషాలను అందిస్తూ
రైతులకు పాడిపంటలు
వనితలకు వనితావాణి
బాలలకు బొమ్మరిల్లు
వృద్దులకు హరికధలు, బుర్రకధలు
కార్మికులకు కార్మికుల కార్యక్రమం
యువకులకు యువవాణి కార్యక్రమం
సినీగీత ప్రియులకు జనరంజని
కార్యక్రమం
మద్య మద్యలో వాతావరణ హెచ్చరికలను అందిస్తూ
ప్రత్యేక వార్తలను ప్రసారం చేస్తూ
సకల జనుల వినోదిని గా పేరుగాంచిన
ఆకాశవాణి(రెడీయో) అవతరణ దినోత్సవం
విజ్ఞానం తో కూడిన వినోదం ఆవిర్భవించిన శుభదినం!
- ఆళ్ల నాగేశ్వరరావు,
7416638823