Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా.కందేపి రాణి ప్రసాద్
అర్ధరాత్రి పూట ఇంటి తలుపులు దబ దబా బాదుతున్నారు ఎవరో లోపల నిద్రపోతున్న డాక్టరు కు మెలుకువ వచ్చింది ఇది ఇల్లు కాదు ఈ టైము లో ఎవరు వచ్చారు పేషెంట్ అనుకుందామన్న హాస్పిటల్ కు రావాలి కదా! ఆలోచిస్తూ లేచి వచ్చి తలుపు తిశాడు ఎదురుగా ఐదారుగురు మనుషులు ఉన్నారు ఒకతని చేతిలో ఒక పదేళ్ల పిల్ల వేలాడుతూ భుజం మీద ఉన్నది సారూ సారూ పిల్ల పలకడం లేదు కన్ను తెరవడం లేదు పిలిస్తే పలకడం లేదు జర చూడండి అని అదుర్దాగా అన్నాడు పిల్ల ను ఎత్తుకచ్చినతను సరే నేను చూస్తాను కానీ హాస్పిటల్ కు రాకుండా ఇంటికి వచ్చారేమిటి ఇక్కడ చిన్న చిన్న ఎక్విప్ మెంట్ తప్ప పెద్ద మిషన్లు ఏమి ఉండవు కదా అడిగాడు డాక్టరు
సారూ హాస్పటల్ కు పోతే తలుపు తిస్తారో లేదోనని ఇక్కడికి వచ్చాము పిల్ల సీరియస్ గా ఉంది ఏమి తోచలేదు అధరా బాధరగా వచ్చేశాము అంటూ నలుగురు ఒకేసారి సమాధానం ఇచ్చారు
వాళ్ళ మాటలు వింటూనే డాక్టరు పాపను పరిక్షిస్తున్నాడు జ్వరం లేదు ఫిట్స్ కూడా లేదు మరి పిల్ల ఎందుకు కదలటం లేదు పిల్లను గట్టిగా గిచ్చి పరీక్షించారు పుట్టిన పిల్లల్ని కూడా ఏడుస్తున్నారా లేదా అని అలాగే గిచ్చి పరిక్షిస్తారు కొద్దిగా మూలిగింది తప్ప ఏమీ కదలటం లేదు డాక్టరు ఆలోచిస్తున్నాడు
అంతలో సారూ సాయంత్రం కల్లు తాపించి పడుకోబెట్టినాకా ఇలా పడిపోయింది రోజూ తాగిపిస్తా గాని ఎప్పుడూ ఇట్లాగాలె మేం తాగేటప్పుడు దానిక్కూడా గ్లాస్ లో పోస్తాం అన్నాడు వచ్చిన వాళ్ళల్లో ఒకతను
పక్కనున్నతను అరే ఇవన్నీ సారు కు చెప్తావా అంటూ కళ్లెర్రజేశాడు చెప్పకపోతే సార్ ఎలా తెలుస్తది రోజూ పోసినంటే పూసినావా ? ఎక్కువేమన్నా పోసినావా పిల్లకు బావా అడిగాడు మరొకతను పిల్ల తండ్రిని
డాక్టరు కు విషయం అర్ధమయ్యింది వీళ్ళు రోజు పోసినట్లే పోసి ఉంటారు ఆ తర్వాత వీళ్ళు మైకంతో పడిపోయి ఉంటారు ఆ తరువాత ఈ పిల్ల ఇంకాస్త పోసుకొని తాగేసి ఉంటుంది చిన్న పిల్ల కదా డోస్ ఎక్కువై ఉలకక పలకక పడిపోయి ఉంటుంది ఇది జరిగిన విషయం వ్యాధి నిర్దారణ అయిపోయింది డాక్టరు ఊపిరి పిల్చుకున్నాడు మీరు పిల్లను తీసుకొని హాస్పిటల్ కు పదండి నేను వస్తున్నాను అక్కడ సెలైన్ పెట్టాలి పడుకోబెట్టడానికి మంచాలుంటాయి అవసరమైన ట్రేట్మెంట్ ఇస్తాను ముందు మీరు పిల్లను తీసుకొని నడవండి అని మిగతా వాళ్లకు చెప్పి పిల్ల తండ్రిని మాత్రం ఉండమన్నాడు చూడయ్యా మీరు తగటమే తప్పు మీరు తాగిందే కాకుండా పిల్లకు తాగించడం ఇంకా తప్పు చిన్న పిల్ల కదా ప్రాణాల మీద కొస్తే ఏం చేస్తారు మద్యానికి బానిసలై ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు సంపాదించిన డబ్బంతా వృధాగా అయిపోతుంది ఐనా ఆడపిల్లకు ఇలా అలవాటు చూస్తే ముందు ముందు పెద్దదై పెళ్లై పిల్లల్ని కనేటప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా మీకు మీరు ముందుగా పిల్లలకు కల్లు తాగించడం మానేయండి పెద్ద వాళ్ళను చూసే పిల్లలు నేర్చుకుంటారు మీరు తాగటం మానేస్తే పిల్లలు కూడా మానేస్తారు అంటూ డాక్టరు హితవు పలికి హాస్పిటల్ వైపుగా స్కూటర్ స్టార్ట్ చేశాడు