Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షర రూపం
దాల్చిన మృగాలు
జానారణ్యంలో తిరుగుతుంటాయి
విద్యారణ్యములో
వెంపర్లాడుతుంటాయి
విజ్ఞానాన్ని వినాశనం కావిస్తుంటాయి
అజ్ఞానాంధకారంలో దొర్లుతుంటాయి
తప్పుల బొక్కలు దొరుకుతాయని ఆరాటం
ఇది.....ఏమి లోకమో
ఇది ........ఏమి చిత్రమో
జ్ఞాన కోకిలలను సైతం
తప్పు దారి పట్టిస్తుంటాయి
ప్రశంశ ఫలితాలు
ఈల వేసి గోల చేసే మృగాలకు
శిక్షలు, చిదరింపులు
అలసట లేక ఇష్టంగా ఏలిన అడవి రాజులకు...
ఇది ఏమి లోకమో..ఇది ఏమి చిత్రమో....
హంసల వంటి
విజ్ఞాన శ్రీమంతులు
ఏమైనా పర్వాలేదు
ఏటిలో మునిగినా పర్వాలేదు
సత్యవంతులు, పనిమంతులు
నిండా మునిగి బెండయి తెలాల్సిందే
మృగాలు మాత్రం రుబాబుగా తిరుగాల్సిందే
ఇది ఏమి లోకమో..ఇది ఏమి చిత్రమో....
న్యాయ దేవతకు
కళ్ళకు గంతలు కట్టడం ఎంత నిజమో
నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో
విద్యా విజ్ఞానాన్ని స్వాహా చేయడం అంతే నిజం
దొంగ జంతువులు ఏవో
మూగ జీవాలు ఏవో
అమాత్యులు తెలిసినా ఏమి చేయలేరు
పట్టి పీడించి చివరకు
చెండ్ర కోలా జడిపించి జులుమ్ చేస్తారు
శ్రమించిన పాపానికి
అడవి రాజులకు మాత్రమే కొరడా దెబ్బలు
ఇది ఏమి లోకమో..ఇది ఏమి చిత్రమో....
-బండి సూర్యారావు, 9490681815