Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినండి మన తెలుగు భాష వైభవం,/ కన రండి నేటి మన తెలుగు భాష దీనగాథ/ కమనీయం, రమణీయం మన తెలుగు కవులు వైభవం/ కడు దయనీయం బాధాకరం, నేటి మన ఆంధ్ర కవుల ధీనగాధలు./ ఒకప్పుడు అమ్మా నాన్న అనే కమ్మనైన/ పిలుపుతో అందరూ పులకరించిపోయేవారు./ఇప్పుడు మమ్మీ-డాడీ అంటూ ఆంగ్లమాద్యమంలో/ అడుగుపెడుతున్నారు పిల్లలు మాటలు నేర్వడం తోనే/ పెద్దబాలశిక్ష పుస్తకాల్ని అటకెక్కించి/ విదేశీ చదువులంటూ /డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు./ విశ్వ ఖండాల వినువీధుల్లో మధురంగా, సుమధురంగా/ రవళిస్తున్న పద్య ప్రక్రియ అచ్చమైన తెలుగు వాడి సొత్తు./ కానీ ఇప్పుడేమో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటూ/ తెలుగుని మర్చిపోయారు నేటి యువత./ ఆనాడు సమాజంలో గల రుగ్మతలను కడ జాతి ప్రజల/ ఈతి బాధలను మాడిపోయే మానవ సమాజాన్ని/ కలమనే ఖడ్గంతో ఎదుర్కొని కవులు తెలుగు వైభవాన్ని/ పాఠకుడి మనోనేత్రానికి చూపించి హృదయాన్ని పులకరింప చేశారు./ నేటి యువత ఆంగ్ల విద్య ప్రతిభని ఫణంగా పెట్టి/ విదేశీ వ్యామోహంలో పడి కన్న తల్లిదండ్రులను/ ఆశ్రమాల పాలు చేసి భారతమాత బాధలను కూడా మర్చిపోయి/ డబ్బు సంపాదనే పరమావధిగా జీవిస్తున్నారు./విదేశీ వ్యామోహం నుంచి ప్రతి ఒక్కరు బయటపడి/ కన్న తల్లిదండ్రులకు, మాతృభూమికి సేవ చేద్దాం./ ఉడతా భక్తిగా మన తెలుగు భాషని సాహిత్యాన్ని/ అకుంఠిత దీక్షతో కాపాడుకుంటూ అటు వృత్తికి, ప్రవృత్తికి/ సమ న్యాయం చేస్తూ మన మేధోశక్తిని/ మన మాతృభూమికి,కన్న తల్లిదండ్రులకి అంకితమిద్దాశీ.
- పింగళి భాగ్యలక్ష్మి,
9704725609