Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కందేపి రాణిప్రసాద్
98661 60378
నళిని ఇల్లంతా గాభరాగా వెతుక్కుంతున్నది. మంచాల కింద,తలుపుల వెనక,డైనింగ్ టేబుల్ కింద ఆయార్థా గా వెతుకు తున్నది.నళిని హడావిడి చూసి భర్త భాస్కర్ నవ్వుకున్నాడు. ఎదో వస్తువు ఎక్కడో పెట్టి వెతుక్కోవడం నళినికి అలవాటే. అంతలో నళిని భాస్కర్ ఉన్న బెడ్ రూములోకి వచ్చి టిన్ను గదిని చూశారా ?అంది గాభరాగా అటు ఇటు చూస్తూనే.
ఏడాది పసివాడు ఎక్కడికి పోతాడు ఇంట్లోనో పెరట్లనో ఉంటాడు. నిదానంగా చూడు అన్నాడు
భాస్కర్ నవ్వుతూ అదే చూస్తున్నానండి. అంటూ బయటకు వెళ్లిన నళిని మరల పడినిమిషాలక్ బెడ్ రూమ్ లోకి వచ్చింది.టిన్ను కనబడలేదంటూ అదిరి పడి లేచాడు భాస్కర్. ఇల్లంతా వెతికడు పెరట్లోనూ వరం డా లోను వెతికడు. ఎక్కడ జడలేదు.
భాస్కర్ వీధిలోకి వెళ్లి పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడిగాడు.ఎవరు రాలేదని చెప్పారు విధి చివరిదాకా వెళ్లి చూసి వచ్చాడు.ఏమి అర్థం కాలేదు
భాస్కరుకు ఇంత చిన్నవాడు ఎక్కడికి వెళతాడు?
అని ఆలోచించ సాగాడు నళిని లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఎవరైనా కిడ్నప్ చేసారంట రా?పేపర్ తెరిస్తే అలాంటి సంఘటనలే కనిపిస్తున్నాయి కదాఁభయంగా అడిగింది. అంతలో పక్కింటి వాళ్ళింట్లో ఉన్న వాళ్ళ అత్తగారు వచ్చి బాత్ రూమ్ వెతికావా అమ్మ పిల్లలకు నీళ్లతో ఆటలు ఇష్టం కదా అన్నది.వెంటనే పరిగెత్తుకుంటూ బాత్ రూమ్ వెళ్లారు.నళిని భాస్కర్ అక్కడ నీళ్ళ బకెట్లో పడిన టిన్నుగాడు కనిపించాడు. భయంతో అరుస్తూ పైకి తీసి ఇద్దరు వెంటనే ఆస్పత్రికి పరుగెత్తారు.
సృజన్ హాస్పిటల్ కు వెళ్లారు. వెంటనే డాక్టర్ పిల్లాడిని పరీక్షించారు. బాగా నీళ్లు తాగేశాడు కానీ తక్కువ సమయంలోనే చూడటం వల్ల ప్రాణం పోలేదు. పొట్టలో నీళ్లను బయటకు కక్కిస్తున్నారు. మందులు ఇస్తున్నారు.కాసేపటికి కాసేపటికి డాక్టర్ యివతలికి వచ్చిప్రాణహాని లేదంటూ హామీ ఇచ్చారు.తల్లితండ్రుల నుంచి విషయమంతా తెలుసుకున్నారు.వాళ్ళతో ఇలా చెప్పారు.
' పిల్లలకు నీళ్లతో ఆడటం చాలా ఇష్టం. నీళ్లతో నింపిన బకెట్లు ఎప్పుడు ఉంచకూడదు.ఆడుతూ ఆడుతూ బకెట్లోకి దొర్లిపోతారు.ఊపిరాడక మరణం సంభవించవచ్చు.పిల్లల్ని వేయి కళ్లతో గమనించాలి.పిల్లల్ని నీళ్లకు నిప్పుకు దూరంగా ఉంచాలని పెద్దవాళ్ళు అందుకే చెప్పేది.ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఇలాంటి సలహాలు ,సూచనలు ఇస్తూంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పెద్దవాళ్లను ఇంట్లో ఉంచుకుంటే మంచిది ' అని సలహా ఇచ్చి .. మరేం భయంలేదంటూ భరోసా ఇచ్చిపంపారు. డాక్టర్ కు భాస్కర్, నళిని దంపతులు కృతజ్ఞతలు తెలిపి పిల్లాడ్ని తీసుకొని వెళ్లారు.