Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెల్లారక ముందే నిదుర లేచే ఆమె నిదురబోతున్న సూర్యున్ని తట్టిలేపి వెలుగందించమంటు మనకోసం లోకానికి పంపుతుంది
కారు మబ్బుల నడుమ కనబడకుండ దాగిన చంద్రుడిని చూపిస్తూ కథలెన్నో చెప్పి ఎప్పటిలాగే
పిల్లలను నిదుర పుచ్చుతుంది
అందరానంత దూరంలో కనిపిస్తున్న ఆకాశం చెట్టుకు పూసిన నక్షత్రాలను దులిపి
అందమైన పూలను మాలగా అల్లి భక్తి భావంతో దేవునికి సమర్పిస్తుంది
మండు వేసవిలో సైతం అడుగంటిన పాతాళ గంగను పైకి లాగేందుకు తానే తోడుగా మారి అమృతాన్ని మనకోసం పైకి తెస్తుంది
అందరి అవసరాలను తీర్చే ఆమె ఇపుడు ఆకాశంలో సగం కాదు?
నీలి ఆకాశం మధ్యలో నవ్వూతూ కనబడే ఆమె విజపతాకాన్ని ఎగరేస్తుా ఇపుడు ఆకాశమే నాదంటుందీ!!
జవేరియా
9849931255