Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబలను చేసి
ఆడుకోవాలనుకున్నారు
ఆకాశమంత
విస్తరిoచావు
విత్తును చేసి
పాటిపెట్టాలనుకొన్నారు
మహా వృక్షమై
ఎదిగావు
సృష్టికి
ప్రతి సృష్టి చేయగల
ఓ మహిళా !
నీవే కదా
నేల పై నడయాడే
దివ్య శక్తివి.
- బత్తుల శ్రీనివాసులు