Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీవు ఒంటరివి కాదు!!...
అమ్మ కడుపులోనుండి...
నువ్వు బయటపడ్డప్పుడే...
పంచభూతాలూ చుట్టేశాయి!!...
మానవుడు కల్పించుకున్న
ఈ కులాలు..మతాలు...
నిర్మించుకున్న వివిధ
సంస్కృతీ సంప్రదాయాలు...
అన్నీ నిన్ను అల్లుకుపోయాయి!!..
ఒక్క క్షణంపాటు ఆలోచించు!!...
నీవు భూమి మీదికి వచ్చినట్లు
ఈ నింగి..నేల..చెట్టు..చేమలే
సజీవ సాక్ష్యాలు!!...
సమాజంతో ఏర్పడ్డ ఈ బంధం...
నీ చివరిశ్వాస వరకూ నిను వీడవు!!...
ఎంత ఉత్సాహంతో ఈ
లోకానికి వచ్చావో...
ఎంత కోలాహలంతో
ఇక్కడ కళ్ళుతెరిచావో...
అప్పుడే కలతల..
కలహం మొదలయింది!!...
నీవు వచ్చింది రంగస్థలంపైకి!!...
సుఖదుఃఖాల కూపంలోకి!!...
సంసారమనే సాగరంలోకి!!...
మానవ సంబంధాలతో ముడిపడి...
మూఢ నమ్మకాల ముసుగులో
అన్ని పాత్రల్లో నడుస్తూ...
నీ సజీవపాత్రతో సాగిపోవలసిందే!!...
నువ్వెంచుకున్నపాత్రకు
ఊపిరి పోయాల్సిందే!!..
ఇదో వింతనాటకం!!...
అంతా బూటకం!!...
ఎన్నెన్నో చిత్రాలు..విచిత్రాలు!!..
పవిత్ర లోకం నుంచి మోసుకొచ్చి
స్వేదం..రుధిరం పొంగిపొర్లే
చిక్కువీడని వ్యవస్థలో...
నిన్ను పడేసింది!!..
ఈ కల్లోల కడలిలో ఇలా...
కదలి పోవడమే నీ పని!!...
నిజానికి ఈ జగమంతా
అన్నీ మన కల్పిత ఇజాలే!!...
అలుముకున్న మబ్బులే!!...
దురుసుతనము..దుడుకుతనము...
ఆశనిరాశాల మధ్య ఆరాటమే!!...
నిరంతరం పోరాటానికి...
నీవు సిద్ధంగా ఉండడమే!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801