Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కందేపి రాణి ప్రసాద్
ఏమండీ వంటయిందా? పాప ఏం చేస్తుంది? అంటూ కింద నుంచి నీరజ పలకరింపు వినడంతో రజని బాల్కనీ నుంచి కిందికి తొంగి చూసింది. మేడ మీద నుంచి రజని కింది పోర్షన్ లో ఉన్న నీరజతో మాట్లాడుతూ ఉంటుంది. రజని వాళ్ళకి చిన్న పాప ఉన్నది. రెండేళ్లు ఉంటాయి. పాప పేరు రవళి, రజని పాపను నెత్తుకొని ఉన్నది. రజని పాపను చూస్తూ చిన్నూ చూడు ఆంటీ పిలుస్తుందంటూ వంగి పాపను చూపించింది. కింది నుంచి నీరజ చిట్టి తల్లి ఆం తిన్నవా అంటూ అడిగింది. రజని పాపతో ఆంటీకి కిస్స్ ఇవ్వు చిన్నూ అంటూ పాపతో ప్లెయింగ్ కిస్స్ ఇప్పించింది. ఇలా మేడ మీద నుంచి రోజు పాపతో సహా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటారు. ఆరోజు కూడా అలాగే రజని, నీరజ మాట్లాడుకుంటున్నారు. కూర మడిపోతున్న వాసన వచ్చి రజని పాపను కిందికి దించి లోపలికి వెళ్ళింది. కింద నించి నీరజ గమనించక రవళి చిన్నూ పాలు తాగవా అంటూ పలకరించింది. పాప ఆంటీతో మాట్లాడాలని ఆరటపడింది. అక్కడ ఉన్న స్టూల్ ఎక్కింది మెల్లగా ఇప్పుడు ప్రహరీ గోడ మీద నుంచి వంగి అంటి అన్నది. ఇంతలో రజని, నీరజ లోపలికి వెళ్లిపోయినట్లుంది. అనుకోని తనూ ఇంట్లోకి వెళ్ళింది. రవళికి అంటి కనపడలేదు ఇంకా ముందుకు వంగింది అయినా అంటి ఇంకా కనిపించకపోవడంతో, ఇంకా ముందుకు వంగింది. కిందనున్న స్టూలు తొనకడంతో రవళి మేడమీద నించి కింద పడిపోయింది. కింద నున్న ప్రహరీ గోడకు సేఫ్టీ కోసం గాజు పెంకులు గుచ్చి ఉన్నాయి. పాప పైనుంచి గాజు పెంకులున్న ప్రహరిపై పడింది. గాజు పెంకులు పొట్టలో గుచ్చుకుపోవడంతో రక్తం ధారలుగా కారి పోయింది.
హడావిడిగా పాపను తీసుకొని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అప్పటికే పాప గౌనంత తడిసిపోయింది. డాక్టర్ ప్రసాద్ పాపను పరీక్షించారు. పొట్ట దగ్గర వెళ్లడంత పొడవునా చిరుకు పోయింది. ఐదారు కుట్లు పడవచ్చు. లోపలి అవయవాలకు ఏమి దెబ్బ తగల్లలేదు కొంత నయం. పర్వాలేదు ప్రాణం పోయే ప్రమాదం ఏమి లేదు. డాక్టర్ ఆలోచించి కాంపౌండర్లకు పాపను శుభ్రం చేసి కుట్లు వేయడానికి అన్ని రెడీ చేయమని చెప్పారు.
డాక్టర్ అంతలో తల్లిదండ్రులను పిలిచి ఎలా జరిగిందని అడిగాడు. మేడ మీద నుంచి పడిపోవడం, పిట్టా గోడ దగ్గర స్టూల్ ఉండడం అన్ని విషయాలు చెప్పారు. చూడాండమ్మ 'చిన్నపిల్లలు ఉన్నపుడు మేడ మీద ఉండే ఇళ్ళలో ఉండడం మంచిది కాదు.సాధ్యమైనంత వరకు కింద పోర్షన్లో ఉండడం మంచింది.అలాగే పిట్టా గోడల బదులు ఇనుప గ్రిల్స్ పెట్టుకుంటున్నారుకొందరు. చాలాసార్లు పిల్లలు ఆ గ్రిల్స్ మధ్యనుంచి దూరిపోయి కింద పడిపోతుంటారు. ఇంకా మెట్ల మధ్య నుండే ఖాళీల్లో నుంచి కూడా జరిపోతారు. పిల్లలున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి' అంటూ హితవు పలికి తల్లి దండ్రుల్ని బయటకు పంపారు. డాక్టర్ పాప దగ్గరకు వెళ్ళాడు.