Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ పుట్టుక
దేశానికే ఓ మైలురాయి!!...
నీ బతుకు దళితులకు ఆదరువు!!..
ప్రపంచానికే కీర్తి శిఖరం!!...
లక్ష్య సాధనకై దివినుంచి
భువికి దిగివొచ్చినావు...
భారతమాతఒడిలో
కళ్ళుతెరిసినపుడే...
ఓ భయంకర దృశ్యం చూస్తివి!!...
నీమనసునిండా కల్లోలం మొదలైంది!!...
చిన్నప్పుడే లోతైన తాత్విక పదాలతో మాటకు సాటిలేని...
ధీటుగా సామాజిక అంశాలతో...
అనేక జీవనవిధానాలను నేర్పితివి!!...
పుట్టుకతోనే పురుడుపోసుకున్న...
సమాజంలోని కుళ్లును ఊడ్చేసేగుణం...
నువ్వు ముళ్ళమీదనడిచి
నీ జాతిని పూలమీద నడిపించావు!!...
కొన్ని జడిభూతాలు
వర్గవర్ణ విభేదాలను సృష్టించి...
జాత్యహంకారంతో అణగతొక్కేశారు!!...
స్పందించి..నేలపైకి దిగివచ్చి...
ఓ కొత్త సంచలనాన్ని సృష్టించి...
ఎన్ని వదంతులు చుట్టేసినా...
ఎన్ని అవరోధాలు ఎదురైనా...
నీఘనతకు తిరుగులేదన్నట్లుగా...
నీ వివేకమునకు అడ్డురారుగానిలిచావు!!..
కులరక్కసి దళితుల బతుకులను
కూలదోస్తోంది!!...
కూల్చేస్తోంది!!...
అందుకే గళమెత్తి గర్జిస్తివి!!...
ప్రతిఘటించే పట్టుదల ఇస్తివి!!...
మంచిని నేర్పే తత్వం..
మనుగడకు మార్గం చూపే మనస్తత్వం...
దళితుల కష్టనష్టాల్లో... ఓదార్పు
నేస్తమై... జన్మాoతం ఊపిరిగా నిలిచావు!!...
బలమైన అక్షరాలతో హోమంచేసి...
దేశ రాజకీయానికి రాజ్యాంగంతో...
ఓ కొత్త ఊపిరిపోశావు!!...
సమానత్వపు పోరాటంతో...
చైతన్య జ్వాలకి ఆజ్యంపోసి...
జాతిని జాగృతపరిచి...
దుస్సహ దుర్మార్గం దురాచారాలను...
రూపుమాపడానికి వచ్చిన
ఓ అవతారమూర్తివి!!...
కనుమరుగవుతోన్న మానవత్వాన్ని
గుండెతలుపులు
తట్టి లేపినావు!!...
ధరణిపై దళితులు ధీటుగా
బతికే విధంగా...
ఆత్మవిశ్వాసంతో
నిలిచే విధంగా... సమాజంలో నిలబెట్టితివి!!...
ధర్మంతో దరిద్రాన్ని తరిమేసి...
ధరణి పై భారాన్ని తగ్గిస్తివి!!...
ఓ కొత్త నూతన వెలుగులో నడిపిస్తివి!!...
మార్పుకోసం ధ్వజమెత్తి...
మానవీయత కోసం గళమెత్తి...
కులాలమీదికి కలమెత్తి...
నీ గమ్యం సమానత్వపువైపుకే...
నడుస్తోన్న వర్గగతిని... స్థితిని...విభేదాలను
మార్గనిర్దేశం చేయడానికి వచ్చిన భీముడివి!!...
అందుకే నీ జననం
ఓ సృజనాత్మకం!!...
దేశానికే మార్గదర్శకమై నిలిస్తివి!!...
దళితుల బతుకులకు ఊపిరై...ఊతమై... ఆకారమై...సాకారమై ఉంటివి!!...
నిత్యం నిన్ను తలచుకొని కొలుచుకుంటున్నారు!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801