Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింటూగాడికి మొన్ననే ఏడాది వెళ్ళింది.మొదటి పుట్టినరోజును అమ్మమ్మ, నాయనమ్మ,తాతయ్య లు అందరి సమక్షంలో గ్రాండ్ గా చేసుకున్నారు.పాత ఇంటివాళ్ళు ఖాళీ చేయమనడంతో కొత్త ఇంటిలోకి మారారు గౌతమి ప్రణీతలు. చింటూ గాడి అసలు పేరు ఆదిత్య. పెళ్లయిన ఐదేళ్ళకు పుట్టాడు వాడు.చింటూ పుట్టాక ప్రణీత ఉద్యోగం మానేసింది.ఇంట్లో బాబును చూసుకోవడానికి ఎవరు లేరు. ప్రణీత కూడా చింటూ గాడిని చూసుకోవడంలో చాలా అలిసిపోతుంది. ఇప్పుడు చింటూ కొద్దిగా నడుస్తున్నాడు.ఎత్తుగా ఉన్నవన్నీ అందుతున్నాయి. షేల్పులలో ఉన్నవన్నీ లాగి కింద పడేస్తున్నాడు. వంట చేసుకుంటుంటే వంటింట్లో కూర్చోబెట్టుకుంటుంది. అక్కడున్న సమన్లన్నీ పరబోసేస్తాడు.ప్రణీతకు వాడు పరబోసేవన్నీ ఎత్తి కోవడంతోనే సరిపోతుంది. ప్రణీత చింటూను ఎత్తుకొని అటు ఇటు తిరుగుతున్నప్పుడు స్విచ్ బోర్డ్ ల దగ్గర స్విచులను గుర్తిస్తున్నాడు.ప్రణీత ఫ్యాన్ స్విచ్ వేయడం చూపించింది.స్విచ్ నొక్కగానే ఫ్యాన్ తిరగడం మరల స్విచ్ నొక్కగానే ఫ్యాన్ ఆగిపోవడం చింటూ కు చాలా సరదాగా అనిపించింది. అలా వాడిచేత స్విచులు వెయిస్తుంటే కిలకిలా నవ్వేవాడు చింటూ సరదాపడుతున్నాడు అనుకున్నదేగాని ప్రణీత రాబోయే ప్రమాదాన్ని గుర్తించలేదు.ఇటువంటి ప్రమాదలపై అవగాహన లేదు తనకు ఒకరోజు ఇలాగే ప్రణీత వంటింట్లో పని చేసుకుంటోంది.హఠాత్తుగా పెద్దగా చింటూ ఏడుపు వినిపించింది. ఒక్కు దుటున కేకవచ్చిన వైపు పరిగెత్తింది ప్రణీత.
బెడ్ రూములో బెడ్ పక్కన అచేతనంగా పడి ఉన్నాడు చింటూ. చూస్తే చింటూ గాడి చెయ్యి కాలిపోయి ఉన్నది. వెంటనే అంబులెన్సుకు గౌతమ్ కూ ఫోన్ చేసింది. ఆసుపత్రిలో చింటూ ను బెడ్ పైన పడుకోబెట్టారు.డాక్టర్ ప్రసాదరావుగారు పరిక్షిస్తున్నారు.కాలిన చేతి వెళ్ళాను పరీక్షించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.గుండె పని తీరు ఎలా ఉందో చూస్తున్నారు.అంత పెద్ద షాక్ ఏమి తగల్లలేదు.
పరవాలేదు ప్రాణప్రమాద మేమి లేదు. చేతి గాయం కూడా మందులు వాడితే తగ్గిపోతుంది.కానీ తల్లిదండ్రులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవలో తెలియటం లేదు. వాటినే చెప్పాలి.అసలు మొదటి సంతానం కలుగగానే వచ్చే ఆపదల గురించి వారికి క్లాసులు తీసుకుంటే ప్రమాదాలు చాలా వరకు నివరించవచ్చనిపించింది. ఈ విషయాల గురించి ఆలోచించాలి "అనుకున్నారు డాక్టరు. డాక్టర్ తన రూము లోకి వెళుతూ ప్రణీత గౌతమ్ లను పిలిచాడు.ఎలా జరిగిందని అడిగాడు.నేను ఇంట్లో లెనున్నాడు గౌతమ్ బెడ్ రూములో పడి ఉన్నాడు నేను గమనించలేదని అన్నది ప్రణీత ఏడుపు స్వరంతో. చూడమ్మా సాధారణంగా బెడ్ రూమ్ లో స్విచ్ బోర్డ్ కిందికి ఉంటుంది గదా ప్లగ్ పాయింటులో వేలు పెట్టివుంటాడు బాబు అయిన ఇంత ఎక్కువగా గాయం తగులదు అది ఎదో చెడి పోయి ఉండవచ్చు. పిల్లలు తిరుగడే వయసులో అన్ని పట్టుకుంటారు.చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్లగ్ పాయింట్లను స్టిక్కర్లతో మూసివేయాలి.పొరపాటున తాకిన ప్రమాదం జరుగదు.ఒక్కసారి ఎలెక్ట్రిషియన్ తో అన్ని చెక్ చేయించుకోవాలి.ఎక్కడైనా రిపేర్లు ఉంటే పూర్తిచేయించుకోవాలి. సాధారణంగా అందరు ఫ్యాన్ లైట్ స్విచులు వేయించడం బెల్ కొట్టించడం పిల్లలతో చేయిస్తుంటారు.ఏడుపు మానతారని అలా చేస్తారు కానీ ఆ అలవాటు మంచిది కాదు.ఈ సమస్యలు నిలబడి నడవటం మొదలుపెట్టకే వస్తాయి. ఏ వయసులో ఎలా కాపాడలో పిల్లల్ని తెలిసికోవాలి తల్లి దండ్రులు అంటూ నిదానంగా వివరించాడు డాక్టర్.
డా:కందేపి రాణిప్రసాద్