Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలత సవిడిబోయిన
cell: 8106359735
'ఆమె' ఇది పుస్తకం మాత్రమే అనుకుంటే పొరపాటే ఎంతో మంది మహిళల,మనోభావాలు వారి అనుభవాలు.వారి పోరాటంతో వారిని వారు నిలబెట్టుకున్న వైనం.ఒక్కొక్కరు ఒక్కో నేపధ్యం.చదువు లేకున్న సాధికారత చూపినవాళ్లు కొందరైతే,తమ ఆధునిక జ్ఞానంతో సాధికారత చూపినవాళ్లు మరికొందరు. స్త్రీ కావటం పాపం అనుకునే ఎంతోమందికి, జన్మంటు ఉంటే స్త్రీ గా పుట్టాలి రా అనిపించిన పుస్తకం!! కాళ్లు లేవు,కళ్లు లేవు అయినా వెనుతిరిగేదే లేదు!! అలుపెరగక ప్రయత్నిస్తూనే ఉంటాం.మా ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాం.గల్లీ నుండి దేశ దేశాల వరకు ఎవరి గురించని చెప్పాలి!! అనిర్వచనీయం !!ఎంత మందిని పరిచయం చేసిందో ఆమె నాకు.
మహిళా సాధికారత,మహిళల గెలుపు ఆగకుండా ఎన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా,ఎదిరించి నిలిచిన జీవితాలు,మనోగతాలే కనిపిస్తున్నాయి. ఆడదే కదా ఏం చేస్తుంది అనుకునే వాళ్ళకి ఆడవారు ఏమైనా చేయగలరు అని ఎన్నో జీవిత విజయాల ద్వారా వారిని పరిచయం చేస్తుంది "ఆమె"!!
ఈ పుస్తకాన్ని మనముందుకు తీసుకొచ్చిన అబ్బాయి ,అదేనండి మహిళల సాధికారత వివరించిన రచయిత వినోద్ మామిడాల మహిళలు సాధించిన ఎన్నో ప్రక్రియలను పచ్చళ్ళ వ్యాపారం నుండి కళ్లు లేకున్నా పట్టుదలే పెట్టుబడిగా సివిల్స్ సాధించిన ప్రంజంల్ పాటిల్ వరకు అందరి తీసుకువచ్చి పరిచయం చేశారు వినోద్ మామిడాల.ఈ బుక్ మనముందు ఉంచటంలో ఆయన కృషి అనిర్వచనీయమే!!
రచయిత: వినోద్ మామిడాల
Mrp- 130/-
Pages 144
https://chat.whatsapp.com/FMQHbJiI1Bw5oEJ4ozj3WK