Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేట్ విద్యకు
ఆయువుపట్టుగా నిలిచి
అరకొర జీతాలతో
అవిరామంగా శ్రమించి
ప్రైవేట్ విద్యారంగాన్ని
భుజస్కంధాలపై మోసి
బోధనతో విద్యార్థులకు
ర్యాంకుల వర్షం కురిపించి
శ్రమించి యాజమాన్యానికి
కాసుల పంట పండించి
బోధనే జీవనాధారమై
శ్రమదోపిడీకి గురౌతున్నా
గత్యంతరం లేక తాను
గడుపుచుండె కాలాన్ని
కరోనా కాటువేయ
జీవనభృతి కోల్పోయె
కుటుంబాన్ని వెళ్ళదీయ
రోజువారీ కూలీగ మారె
ఆలవాటు లేని పనులు
అవసరార్థం అలవర్చుకునె
ఉన్నత చదువులు చదివి
బోధనే వృత్తిగా నమ్మి
ప్రభుత్వ నియామకాలు లేక
ప్రైవేట్ రంగాన్ని ఆశ్రయించి
శ్రమనంతా ధారబోసి
సంపదను కూడబెట్టినా
నేడు కానివాడయ్యాడు
యాజమాన్యానికి తాను
విద్యా వ్యాపారంలో
బలిపశువయ్యాడు
కనీస బాధ్యతెరిగి
కాచువారులేక
చెప్ఫుకొన వీలు లేక
ఆదుకొను వారు లేక
శ్రమకు గుర్తింపు లేక
వృత్తికి గౌరవం లేక
అద్దాలమేడలు సృష్టించి నాడు
ఆడ్డా కూలీగ మారె నేడు
ధనవంతుల తయారు చేసి
దారిద్ర్యంలో గడుపుచుండె
-పి.రామనాథం,
భద్రాద్రి కొత్తగూడెం