Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏదో ఆశతో
అందరితో స్నేహం చేయడం...
ఏదో బలమైన కారణంతో
ఆత్మీయతను పంచుకోవడం...
ఇలాంటి సావాసం
చేసేవారెందరో!!...
ఇదోరకమైన కుటిలస్నేహం!!..
అవసరం తీరాక...స్నేహాన్ని తుంచి
ఆత్మీయతను కూల్చేస్తారు!!...
అంతటా తానై వెలగాలని...
ప్రపంచ చరిత్రలో నిలవాలని...
భూగోళాన్నే చుట్టేయాలని...
ఆకాశాన్ని అందుకోవాలని...
పట్టపగ్గాలులేని పరుగులు పెడుతుంటారు!!...
పట్టుకోల్పోని ఉడుముపట్టుతో...
లోపల అంతా స్వార్థంతో
ఆరాటంతో మొదలుపెట్టి
పోరాటం కొనసాగిస్తుంటారు!!...
వీరిని నమ్ముకున్న వారు
నలిగి పోవలసిందే!!...
మానవ సంబంధాలు
అంతరించవలసిందే!!...
అవకాశవాదులకు
ఆత్మీయతలు ఉండవు!!...
దయ..కనికరం చూపరు!!...
వీరివలన మానవత్వం
గతి తప్పుతుంది...
మంచితనం మరుగునపడిపోతుంది!!....
కొందరికి కంట్లో నలుసై నిలుస్తారు!!...
కొందరు పంటికింద
రాయిగా మిగిలిపోతారు!!...
చివరికి సమస్తాన్ని కోల్పోయి
సమస్యల
చిక్కుముడిలో పడిపోతారు!!...
ప్రగతి బాటలో
కంటకాలుగా మారిపోతారు!!..
వాళ్ళ వ్యక్తిత్వం
వారినే వెక్కిరిస్తుంది!!...
ఆకాశమంత ఎదిగినా
వ్యక్తిత్వం లేకపోతే...
ఎంత విషయ పరిజ్ఞానం ఉన్నా
విషంగా మారుతుంది!!...
పరుగెత్తే కాలంతో సాగే
ప్రకృతిని ఆసరాగా చేసుకొని
ఎన్నెన్నో ప్రాణులు జీవిస్తున్నాయి!!...
ఎలాంటి ఆశలు స్వార్థాలు
ఈర్ష్యలు కుట్రలు కుతంత్రాలు
లేకుండా అన్నిప్రాణులు
కలసే జీవిస్తున్నాయి!!...
సర్వ ప్రాణులకంటే శ్రేష్ఠుడైన
మానవుడు మాత్రం కుట్రదారుడై
సదా విషం కక్కుతుంటాడు!!...
సుఖమయ జీవితం కోసం...
తన స్వార్థం కోసం...
సమస్త జీవరాశులనూ బలిచేస్తున్నాడు!!...
అందరిపై బలప్రయోగానికి పూనుకుంటున్నాడు!!..
అందుకే వ్యక్తుల్లో ఆశపెరిగింది!!...
స్వార్థము నిండింది!!...
సంకుచిత మనస్తత్వాలతో
ఒకరిమీద ఒకరు ద్వేషం పెంచుకున్నారు!!....
విలువైన జీవితాన్నే కోల్పోతున్నారు!!....
చివరికి వ్యక్తిత్వాన్ని కోల్పోయి...
మాయని మచ్చతో సమాజపు
చీడపురుగుల్లా మిగిలిపోతున్నారు!!...
- అంబటి నారాయణ
9849326801