Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒరిగిన నింగి కరిగి
వానై నేలను తాకితే...
చేతులడ్డుపెట్టి గగనపు చిల్లులు
నే పూడ్చలేను...!
గొడుగుపట్టి..
తనువు తడవకుండా నివారించగలనంతే....!
ఎరుపెక్కిన చెంపలవెంట
అశ్రువుల అంతరగపు ఆవేదనలను..
అలసిన ఆశల అంతర్మథనాన్ని..
నే చేధించలేను...!
కన్నీటి దారను చేతితో తుడిచి
మది మనాదిని
బతుకు బాధల భారాన్ని
మనస్ఫూర్తిగా పంచుకుని
వూసూల తోటే ఊపిరిపోస్తూ
ఓదార్పునివ్వగలను...
నిష్కలమ్మశంగా.. మనసుకత్హుకొని
భుజం తట్టి
ఉఛ్వాస నిశ్వాసల్లో కొంత ఉత్సాహం నింపి
పోరాడగలవనే నమ్మకాన్ని మాత్రమే ఇవ్వగలను....
ఒక మనసున్న మనిషిగా......!
- గుడిసె.రాజశేఖర్