Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెనడా ఉగాది సాహిత్య తెలుగు సభ- కెనడా తెలుగు తల్లి సౌజన్యంతో ఆహ్వానం టొరంటో: కెనడా టొరంటోలో 1985లో ఒక తెలుగు తల్లి పత్రిక శ్రీమతి కొమరవోలు సరోజ గారిచే ప్రారంభించబడింది. 2016లో 11 మంది సభ్యులు గల ఒక ఔత్సాహిక కమిటీ బృందం తెలుగుతల్లి పత్రికని పునర్నిర్మాణం చేసి వెబ్ మాస పత్రికగా కెనడా స్వచ్ఛంద సంస్థగా నెలకొల్పబడింది. తెలుగు తల్లి కెనడా మ్యాగ్జైన్ లాభాపేక్ష లేని సంస్థ. తెలుగు తల్లి వెబ్ మ్యాగ్జైన్ ప్రతి నెల విడుదల అవుతుంది. టొరాంటో తెలుగు టైమ్స్ గత ఏడాది సర్దార్ ఖాన్‌తో ప్రారంభించబడి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కెనడా నుండి నిర్వహిస్తున్న మొట్టమొదటి వార్షికోత్సవ సాహిత్య సభ శనివారం, 3 ఏప్రిల్ 2021 నాడు జరగబోతోంది. సాహిత్య ప్రసంగాలు, కవి సంగమం, కథా సమయం, జానపద గేయగానం, సరదా క్విజ్ వంటి అనేక వైవిధ్యమైన అంశాలతో ఈ సభ కళకళలాడబోతోంది. ఈ సందర్భంగా అందరికీ ఆహ్వానం పలికిన నిర్వాహకులు.. ఆన్లైన్ ద్వారా వీక్షించేందుకు https://youtu.be/JLf5JBxYyaE యూట్యూబ్ లింక్‌ను వినియోగించాలని కోరారు.
సభ సమయం: కెనడా టొరంటోలో- శనివారం 3, 2021- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
సమయం: ఇండియాలో- శనివారం 3, 2021- రాత్రి 7.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు
మీ అమూల్య సలహాలను పంపించేందుకు ఈ-మెయిల్: editor.telugutalli@gmail.com