Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మణినాథ్ కోపల్లె
హైదరాబాద్
9703044410
అందమైన మహా వృక్షాలు నీవి!
ఆ మహా వృక్షాలే ప్రాణ శక్తి మాకు!!
సువాసనల పూదోటలు నీవి !
ఆ సువాసనలన్నీ మావి!!
జీవ నదుల సవ్వడులు నీవి!
ఆ నీరు త్రాగి జీవించే మేము !!
ఉష కిరణాల అందాలు నీవి!
ఆ ఉషస్సుల నవశక్తి మాది!!
మహోన్నత హిమగిరులు నీవి!
ఆ హిమగిరులే రక్షణ మాకు!!
మబ్బుల్లో దాగిన వానవి నువ్వు!
ఆ వానలతో పండిన పంటలు మావి!!
అంతటా పచ్చని పైరులతో నీవు!
ఆ పచ్చని పైరులే అన్నదాత మాకు !!
ప్రతి ఏటా వసంత శోభ నీది
ఆ వసంతమే కొత్త ఆశలు రేపు మాలో!!
వన్య ప్రాణులకి నివాసం నీవు !
ఆ వన్య ప్రాణ సంరక్షణే నేటి నినాదం మాకు!!
తల్లిలా ఆదరించే నీవు!
ఆ తల్లి నీడన జీవించే మేము!!
ప్రకోపించితే ప్రళయమే నీవు!
ఆ ప్రళయానికి ఆహుతి మేము!!
సృష్టిని సృష్టించే తత్వం నీది!
సృష్టి లో కలిసే మేము!!
ప్రతి జీవికి ప్రాణాధారం నీవు
ప్రకృతి ని కాపాడుదాం !!