Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి భారతానికి ఏమైంది?
కరోనా కష్టాలు
ఒక్కసారి ఉలిక్కిపడింది
భరతమాత
క్షణం క్షణం
భయం భయం
అన్నట్లు
భయం గుప్పిట్లో
బతుకుతున్న జనం
విశ్వమంత
విషాదఛాయలు
అలముకున్నాయి !
ప్రకృతి ప్రళయమా..
విధి శాపాల మయమా...
మృత్యు మేఘాలు
అలముకున్న
మోముతో
భరత మాత
మృత్యుఒడిలో
బిడ్డలను చూసి
రక్తమోడుతున్న కన్నులతో
గుండె నిబ్బరం
చేసుకుంటుంది!
ఎటు చూసినా కరోనా
హాహాకారాలు
విషగాలితో ఉక్కిరిబిక్కిరై
ఊపిరిలు వదిలిన ప్రాణాలు ఎన్నో?
తిరిగిరాని లోకాలకు
వెళ్లిపోయిన ఘోరకలి ఇది!
ఏమిటి ప్రకృతి వైపరీత్యాలు
ఎవరు చేసిన పాపం ఇది?
ఎవరి నిర్లక్ష్య ధోరణి?
సామాజిక సృహ ఎవరికి పట్టి లేదా?
స్వార్థ ప్రయోజనాల కోసం
మనం చేసిన పాపాలకు
కాలం కన్నీటితో
ప్రక్షాళన చేసుకుం టుందా..
ప్రకృతి పరిహారం చెల్లిస్తుందా..
ఈ ప్రశ్నకు సమాధానం ఏది?
గుండెలవిసేలా
మౌన రోదినలు
ప్రకృతి ప్రళయం ముంగిట
ఏ మాటల కందని
మహా విషాదానికి
సాక్ష్యం ఏదంటే...?
మౌనమే అవుతుంది!
- నెల్లుట్లసునీత
7989469657