Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మృగశిర కార్తె ప్రధమదినం విశ్వమంతా పర్వదినం!
మృగశిర మృగం మిరుగు మిర్గం అని విభిన్న ప్రాంతాల్లో నామధేయం!
సృష్టిలో విశిష్టంగా మనిషి జీవితంలో మరవలేనిది మృగశిర!
వైశంపాయనుడు మృగశిర కార్తె రోజున యాజ్ఞవల్క్యుని కి తైత్తిరీయోపనిషత్తు ను బోధించాడు!
ఇదే మన భరత పురాణ ప్రాశస్త్యం!
వరుణ దేవుని ప్రార్థన తో ప్రారంభం సుదినం!
ఈ కార్తె మనకు అత్యంత ప్రాధాన్యం!
తొలకరి జల్లుల్లో మట్టి వాసనలతో మనసును మైమరిపిస్తూ...!
నేల తల్లి గొంతు తడపడానికి వస్తున్నా వానమ్మ నీకు స్వాగతం!
చినుకమ్మా నీకు సుస్వాగతం!
నేటి వర్షాకాల ఆరంభానికి ముఖ్యఅతిథి మృగశిర!
రైతన్నల కు నైరుతి రుతుపవనాలు బాసటగా నిలిచి!
చల్ల చల్ల చిరుజల్లులు ప్రవేశంతో తొలకరి జల్లుల తో పులకరించిన పుడమితల్లి! ఆనందాలు వెల్లివిరిసి!
వర్షాలు బాగా కురిసి రైతన్న కళ్ళల్లో బంగారు కాంతులు!
మట్టిని బంగారంగా మార్చే పనిలో రైతన్న మునిగి!
సిరుల పంట ల తో ఇల్లంతా నిండి!
ప్రకృతి మార్పుగా మృగశిర తో మొదలయ్యే మన సాంప్రదాయం!
మనసున పరవశించే మృగశిర!
అయింది మన మనోగతం!
రుగ్మతలను రూపుమాపే ఆస్తమా బాధితులకు అందించే చేపమందు!
మహారుషులు బోధించిన దివ్యౌషధం రహస్యాలు!
కొర్రమీను బెల్లంతో ఇంగువ కలిపిన దివ్యౌషధం సేవనం!
ఉష్ణాన్ని ప్రేరేపించి వ్యాధులను నివారించే!
ఆస్తమా ను తరిమివేసే దివ్యౌషధం!
మానవునిలో ఓజస్సు తేజస్సు!
జీవకు డే ప్రాచీన వైద్యుడు!
చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో
14 రోజులు ఉండి ఏ నక్షత్ర సమీపంలో ఉంటే ఆ నామమే ఆ కార్తే పేరు!
మృగశిర కు చేరువలో చంద్రుడు ఉండగా!
మృగశిర కార్తె ఆగమనం జరిగి!
రైతుల ఏరువాక సా గేటి నాగటి చాలు!
భగవద్గీత గ్రంథాల్లో విశిష్ట ప్రాధాన్యత!
ఆధ్యాత్మిక చింతనలో అందరం గడిపి భగవంతుడు ఆశీర్వాదాలు పొందుదాం!
రైతన్నలకు అండగా ఉందాం!
- నెల్లుట్ల సునీత