Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల్లుట్ల సునీత
మౌనమే మధురమైనది
మనుషుల మధ్య భావ
ప్రసారాలు హృద్యంగా
సాగినప్పుడే.
సంబంధాలు సామరస్యంగా
సాగుతాయి.
కాకులు పాటల పోటీకి
దిగినప్పుడు . కోకిల
పాడకపోతే నే కదా.
గట్టి పోటీ ఇచ్చినట్లు
కాకిలా మారిపోవాలా
కోకిలల మిగిలి పోవాలా....?
హద్దుమీరి ప్రేలాపనలు
పేలుతున్న వ్యక్తుల మధ్య
మన మాట చెల్లుబాటు
కావాలని. మొండి ప్రయత్నాలు చేయకూడదు.
మాటల్లో బయటపడలేక
మూగనోము తో మదన పడిపోతూ ఉంటే
ద్వేషాన్ని ద్విగుణీకృతం
చేసుకుంటూ ఉంటే
మరింత ప్రమాదకరం!
ఎదుటివారు చేసిన గాయాన్ని
మరిచిపోయే మన్నించే పెద్ద మనస్సు
మొగ్గ తొడిగి మధురమైనది
మౌనమే మధురమైనది