Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహమ్మద్ చాంద్ బేగం
తొలకరిచినుకు నేలతల్లిపై కురిసేను
జీవకోటికి ఆనందాన్ని నింపెను
జగతికి చల్లదనాన్ని నిచ్చెను
చూడచక్కని తెలుగు సున్నితంబు
చిన్నారులు కాగితపు పడవలు
కేరింతలు కొడుతూ వదిలిరి
ఆనందంతో ఉప్పొంగేను మనసు
చూడచక్కని తెలుగు సున్నితంబు
రైతన్నల ఆశలు చిగురించెను
వ్యవసాయ సాగు ప్రారంభించెను
భూమిపై విత్తు నాటేను
చూడచక్కని తెలుగు సున్నితంబు
నల్లని మేఘాలు కమ్ముకుని
ఉరుములు మెరుపులతో గర్జిస్తూ
వానజల్లుతో ఇంద్రధనుస్సు కనువిందుచేస్తూ
చూడచక్కని తెలుగు సున్నితంబు
మట్టివాసన గుప్పున వెదజల్లేను
పకృతి పచ్చదనాన్ని విరజిమ్మేను
పుడమి తనువు పులకరించెను
చూడచక్కని తెలుగు సున్నితంబు