Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తోటలోని పూవుల గుబాళింపు
పరవశంతో తనువు పులకరింపు
ప్రేమపూరిత ఒక్క పలకరింపు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
కష్టాల సమయాన ఆదరించు
హృదయంలో బాధలు సంహరించు
నష్టాల నావలో పలకరించు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
పలకరింపు బంధాలు నిలబెట్టు
మదిలోని మంచితనం చూపెట్టు
కొండంత దుఃఖాన్ని తరిమికొట్టు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
పలకరింపులో గర్వమే లేదు
గర్వమున్నచో ప్రేమసలు రాదు
వినయశీలురు హృదయంలో వీడదు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
విలువైనది కాసింత పలకరింపు
మేలి బంధాలకు కొనసాగింపు
లేదోయ్! పలకరింపుకు ముగింపు
చూడచక్కని తెలుగు సున్నితంబు
- గద్వాల సోమన్న,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580