Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందమైన చందమామ
ఆకసాన వెలశాడు
కొలనులోని కలువలను
తొంగితొంగి చూశాడు
కొమ్మల మధ్యలోన
కనువిందు చేశాడు
నీటిలోన తన రూపము
చూసిచూసి నవ్వాడు
అద్దంలో చిక్కినాడే!
చక్కనైన చిన్నోడు
నక్కినక్కి చూసినాడే!
మబ్బుల్లో చందురుడు
వెండి గిన్నె అయినాడు
పౌర్ణిమి రోజుల్లో
మసకబారి పోయినాడు
అమవాస్య రోజుల్లో
బుజ్జాయికి బొజ్జనింపు
వేళల్లో జతగాడు
అమ్మ జోలపాట వినే
మనసున్న మహా రేడు
అందమైన చందమామ
అందరికి మేనమామ
అందరాని చందమామ
బంధువాయె చందమామ
- గద్వాల సోమన్న
9966414580