Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్య వినీలాకాశంలో
అద్వితీయ ధృవతార..
సంప్రదాయ పంచెకట్టుతో
తెలుగుదనం ఉట్టిపడే విగ్రహం..
రాస్తూ రాస్తూ పోతా..
పోతూ పోతూ రాస్తానన్న మాటలకు
అక్షర సాక్ష్య జీవితం..
వెండి తెరపై
పండు వెన్నెలలు పూయించిన సినీ పాటలు, గజల్స్, గేయాలు, కవితల పరిమళాలు
వెదజల్లిన సారసత్వ సౌజన్యం..
కథా కథనం, పద్య గద్య, వ్యాస విమర్శ ప్రక్రియ రూపక జ్ఞానపీఠం..
విశేష పదవుల అలంకృత కవిశ్రేష్ఠం..
అభ్యుదయ కవిత్వానికి
అందమైన అర్థానిచ్చిన సాహితీ దిగ్గజం..
అక్షరాలకు అలంకరణ
సొబగు జిలుగు వెలుగులద్ది..
తెలుగుకి వన్నె తెచ్చిన 'విశ్వంభరుడు' సి.నా.రె!
- సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.