Authorization
Mon Jan 19, 2015 06:51 pm
"బాంబులు, తుపాకులు విప్లవం సాధించలేవు. విప్లవం అనే కత్తిని మీ ఆలోచనలపై పదును పెట్టండి" అంటాడు భగత్ సింగ్. యువత తమ అలోచనలనే బాంబులు, కత్తులతో దేశ రక్షణ అనే ఒకే ఒక లక్ష్యంతో పోరాడి బ్రిటీష్ వాళ్ళకు మన శక్తిని చాటాలని ప్రబోధించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అమృత్సర్ వేదికగా చేసుకుని హిందీ, ఉర్దూలలో వార్తా పత్రికలలో వ్యాసాలు వ్రాయటం ప్రారంభించిన భగత్ అతితక్కువ ధరలో కరపత్రాలను ముద్రించి ఇంటింటికీ పంచేవాడు. 1928 లో సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో లాలాలజపతిరాయ్ నాయకత్వంలో వెళుతున్న ర్యాలీపై జేమ్స్ స్కాట్ ఆవేశంతో పోలీసులు లాఠీచార్జి చేసారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన లాలాలజపతిరాయ్ కొద్దిరోజులలో గుండెపోటుతో మరణించారు. (1928 నవంబర్ 17) అయితే దీనిపై ఏ మాత్రం విచారం వ్యక్తం చేయని బ్రిటీష్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో భగత్‌సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్ కలిసి అప్పటి పోలీస్ అధికారి జాన్ సౌండర్స్ని కాల్చి చంపారు. సౌండర్స్ని అంతమొందించినా తరువాత భిన్న ప్రాంతాలలో భిన్న రూపాలలో సంచరించివ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్ దేవ్‌లు 1929లో బ్రిటీష్ అసెంబ్లీపై బాంబు దాడికి ప్రణాళిక చేసారు. 1929 ఏప్రియల్ 8వ బతుకేశ్వర్‌దత్ అనే సహచరుడితో కలిసి అసెంబ్లీ జరుగుతుండగా బాంబులు విసిరారు. ఆ ఘటనలో ఆర్దిక మంత్రి జార్జ్ ఎర్నేస్ట్ ఘాష్టర్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర పొగరో నిండిన ఆ ప్రాంతం నుండి భగత్‌సింగ్, దత్‌లు ఆ సమయరిలో “ఇంక్విలాబ్ జిందాబాద్” అనే నినాదంతో బిగ్గరగా ప్రతి వివరించారు. ఆ సందర్భంలోనే వారిద్దరినీ అరెస్ట్ చేసి చెరసాలకు తరలిరిదారు. అనంతరం వివిధ సంఘటనలలో ప్రమేయం ఉన్న రాజ్ గురుతో పాటు ఆ ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు రచించుకున్నట్లుగా ఆయన తరువాత జీవితంలో జరిగిన సంఘటనలు నిర్ధారిస్తాయి.
యంగ్ రివల్యూషనరీ మూమెంట్లో చేరిన భగత్‌సింగ్ బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం ప్రారంభించాడు. కేవలం 15 స౦||ల బాలుడు ప్రారంభించిన ఈ చేతన భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన అధ్యాయంగా అభివర్ణించవచ్చు తన తోటి వయస్సు ఉన్న యువకులపై బలమైన ముద్రవేస్తూ ఆవేశపూరిత ప్రసంగం ద్వారా వారిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు భగత్ సింగ్ నడిపించాడు. 1923 లో భగత్‌సింగ్ లాహోర్ లోని నేషనల్ కళాశాలలో ప్రవేశించి అన్నివిభాగాలకు చెందిన పోటీలలో పాల్గొని సమాజంలోని ఇబ్బందులను ఆనాటి విద్యార్థుల ముందు ఉంచేవాడు. తనలోని దేశాభిమానం, దేశం పట్ల బాధ్యతను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టని అద్భుత యోధుడు భగత్‌సింగ్. ఇటలీలో గైసెస్సీ మజ్ఞినీ’ స్థాపించిన ‘యంగ్ ఇటలీ’ సంస్ధలతో “నవ జవాన్ భారత సభ” అనే సంస్థను 1926 మార్చిలో స్థాపించాడు. "నా ప్రాణం నా దేశం కోసం , నా దృష్టిలో పెళ్ళి అంటే బానిస బ్రతుకు .. భారతదేశం కోసం… నా ఈ బ్రతుకు" అంటాడు భగత్ సింగ్. ఆయన దేశాన్ని అంతగా ప్రేమించాడు. తన జీవితాన్ని భారతదేశ విముక్తి కోసం త్యాగం చేసిన ప్రచండ శక్తి భగత్‌సింగ్. అనంతరరం చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద్, బిస్మిల్ షాహిద్ ఆగఫ్ అల్లాఖ్ఖాన్లు స్థాపించిన “హిందుస్దాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరి దేశ స్వాతంత్య్రం కోసం పనిచేశాడు. ఉద్యమం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతున్న భగత్ సింగ్ పై దృష్టిపెట్టిన బ్రిటీష్ వాళ్ళు మేలో అరెస్ట్ చేశారు. రూ" 60,000/పూచీకత్తుపై 5 వారాల అనంతరం విడిచి పెట్టారు. సుఖ్‌దేవ్‌లను కూడా అరెస్ట్ చేసి ముగ్గురినీ 1931 మార్చి 23న సాయంత్రం 7 గం11లకు ఉరి తీశారు. “బానిసత్వమే సమాజంలో అత్యంత భరించలేని విషయం” భగత్ సింగ్ బానిస బ్రతుకు కంటే ఎదిరించి మరణించటం గొప్ప విషయంగా భగత్‌సింగ్ అభివర్ణించాడు. సాంకేతిక విప్లవ హోరులో, ప్రచార, ప్రసార మాధ్యమాల ప్రయాణంలో, సినిమా, డ్రగ్స్, భావదారిద్ర్య ముసుగులో జీవితాలను బానిసత్వంలోకి నెట్టుకుంటున్న యువత దేశంకోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన “భగత్‌సింగ్”ను స్ఫూర్తిగా తీసుకొని దేశరక్షణలో, అభివృద్దిలో మమేకం కావాలి.
- అట్లూరి వెంకట రమణ
9550776152