Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు,
జాషువా గారు పుడుతూనే
సాహితీ పరిమళాల్ని వెదజల్లుతూ
సాహితీ ప్రపంచానికి వన్నె తెచ్చారు.
మన తెలుగు భాష లోనే అనిర్వచనీయమైన
వాణికి, బాణికి సరికొత్త సదస్సులు దిద్ది
తన రచనలతో నవ సమాజ నిర్మాణానికి
పునాదిరాళ్లు వేసిన ప్రజ్ఞాశాలి.
ఆనాటి సమాజంలోని రుగ్మతలను, బాధలను,
కుల రక్కసిని పారద్రోలి
నిద్రపోతున్న సమాజాన్ని తట్టిలేపి
కొత్త ఒరవడి సృష్టించారు.
అంటరానితనం ఆర్థిక అసమానతలు,
ఆర్థిక వ్యవస్థ, కుల వ్యవస్థలతో
కంపుకొడుతున్న ఈ సమాజాన్ని చూసి
చెల్లించి, జ్వలించి బాధాతప్త హృదయుడై
నిజాన్ని నిగ్గదీసిన సాంఘిక విప్లవకారుడు.
దళిత వేదనే ధ్వనిగా,
కరుణ రసావిష్కరణే కావ్యాత్మగా
అణగారిన జాతి జనుల ఈతిబాధలనే
కావ్య వస్తువులుగా, పద్య
శిల్పాలుగా వినిపిస్తూ
పద్యాలకు ప్రాణం పోసిన
సాహితీ ధ్రువతార జాషువాకు నివాళి.
పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు
ఫోన్ నెంబర్.9704725609