Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోరుబందరులో పుట్టి పోరుబాట బట్టి...
ఆంగ్లేయ అధికారులనెదిరించి...
సహాయ నిరాకరణోద్యామానికి శ్రీకారం చుట్టి...
విదేశీ వస్త్రాలను బహిష్కరించి...
స్వదేశీ విద్యను ప్రోత్సహించి...
జాతీయ స్వాతంత్ర్యాన్ని ప్రజల్లో రేకెత్తించి...
స్వరాజ్యం మా జన్మహక్కని చాటించి...
స్వదేశీ జనులలో ఉద్యమ స్ఫూర్తిని నింపి...
సత్యం అహింస సూత్రాలను బోధించి...
జాతి వివక్షతను ఎదిరించి...
హరిజనోద్ధరణకు కృషి చేసి...
మత సామరస్యతను సమర్ధించి...
శాసనోల్లంఘన ఉద్యమానికి ఊపిరి పోసి...
ఆంగ్లేయుల నిర్బంధకాండ నెదుర్కొని...
మాతృభూమి దాస్యశృంఖలాల నుంచి...
విముక్తికై అలుపెరగని పోరాటం చేసి...
బ్రిటిష్ మరతుపాకులకు ఎదురునిలిచి...
క్విట్ ఇండియా ఉప్పు సత్యాగ్రహాలను చేపట్టి...
ఆంగ్లేయుల సామ్రాజ్యవాదానికి అడ్డుకట్టవేసి...
సబర్మతి ఆశ్రమాన రాట్నం తిప్పి...
భారతీయులలో చైతన్యాన్ని కలిగించి...
తెల్లదొరల ఘోరశాసనాలను కూలదోసి...
సంపూర్ణ స్వతంత్ర దిశగా అడుగులు వేసి...
విజయం సాధించిన మహనీయుడు
స్వరాజ్యమే గాంధీ నినాదమని
ఎలుగెత్తి చాటిచెప్పిన మహిమాన్వితుడు
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
కొణతం చైతన్య కుమార్
తెలుగు ఉపాధ్యాయుడు
చరవాణి: 8247076494