Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నతనంలో.... స్వచ్ఛత ఉన్నది
మధ్యస్థంలో.... మలుపు ఉన్నది
వృద్ధాప్యంలో.... అనుభవం ఉన్నది
ఓర్పులో...... సహనం ఉన్నది
ప్రాయంలో......ప్రణయం ఉన్నది
నేర్పులో...... కూర్పు ఉన్నది
సహకారం లో.....ఉపకారం ఉన్నది
మమకారంలో.....అనురాగం ఉన్నది
బంధంలో ...... అనుబంధం ఉన్నది
రూపంలో...... అపురూపం ఉన్నది
తాపంలో......తాపత్రయం ఉన్నది
ఆవేశంలో....... అవివేకం ఉన్నది
నీతి లో.......నిజాయితీ ఉన్నది
కీర్తి లో...... ఘనత ఉన్నది
పేరులో...... ప్రతిష్ట ఉన్నది
యువతరంలో... నవతరం ఉన్నది
నవతరం లో....... సృజనాత్మకత ఉన్నది
సృజనలో..... ప్రతిభ ఉన్నది.