Authorization
Thu April 03, 2025 02:22:12 pm
నైటింగేల్ ఆఫ్ సౌత్ జానకమ్మ స్వరం
నీలి మేఘాల్ని కరిగిస్తుంది
ఏ దీవిలోనో విరిసిన పారిజాత
సుగంధ పుష్పాలని మన ముంగిటకు తెస్తుంది
గాలి కెరటాలతో దోబూచులాడుతుంది
ఆ గానం గున్న మామిడి కొమ్మ మీద
కూసే ముద్దులొలికే కోయిల గీతం
సిరివెన్నెల నవ్వుల ప్రవాహం
తన సొంత ప్రియరాగాలతో
సంగీత ప్రియుల్ని ఉయలలూగిస్తున్న
సంగీత సరస్వతి మంత్ర ముద్ద గళమే జానకి
సృష్టి స్థితి లయలయిన సరిగమలను
స్వరాలంకార భూషితంగా
తనలో ఇముడ్చుకున్నారు
జానకమ్మ గళం నుంచి జాలువారిన వేలవేల పాటలు
సుగంధ పరిమళాలతో పునీత మయ్యాయి
ఈ మహిమాన్విత మూర్తి, గాయని, పాటల రచయిత్రి,
కర్ణాటక సంగీత విద్వాంసులు,
పాటల పరిమళ పుష్పం
తన పాటల పరిమళాలతో
వెండితెర పాటల పూతోటలో
మరిన్ని అమృత గుళికలు అందించాలని కోరుకుంటూ
కలైమామణి బిరుదాంకితులు
అమ్మ జానకమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు
కాలమిస్టు రచయిత్రి
ఫోన్ నెంబర్.9704725609